వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను: లగడపాటి

| Edited By: Srinu

Mar 06, 2019 | 8:25 PM

రానున్న ఎన్నికల్లో పోటీ చేయనని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన తరువాత రాజకీయాలకు దూరమైన లగడపాటి.. ఇటీవల మళ్లీ చురుగ్గా కనిపించారు. దానికి తోడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలవడంతో రాజకీయాల్లోకి ఆయన రీ ఎంట్రీ ఇస్తున్నట్లు వస్తోన్న వార్తలకు మరింత బలం చేకూరింది. తాజాగా వాటిపై స్పష్టతను ఇచ్చారు లగడపాటి. తాను ఏ పార్టీలోనూ చేరబోవడం లేదని, వచ్చే ఎన్నికల్లోనూ పోటీ చేయాలని అనుకోవడం లేదని స్పష్టం చేశారు. తన […]

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను: లగడపాటి
Follow us on

రానున్న ఎన్నికల్లో పోటీ చేయనని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన తరువాత రాజకీయాలకు దూరమైన లగడపాటి.. ఇటీవల మళ్లీ చురుగ్గా కనిపించారు. దానికి తోడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలవడంతో రాజకీయాల్లోకి ఆయన రీ ఎంట్రీ ఇస్తున్నట్లు వస్తోన్న వార్తలకు మరింత బలం చేకూరింది. తాజాగా వాటిపై స్పష్టతను ఇచ్చారు లగడపాటి. తాను ఏ పార్టీలోనూ చేరబోవడం లేదని, వచ్చే ఎన్నికల్లోనూ పోటీ చేయాలని అనుకోవడం లేదని స్పష్టం చేశారు. తన పోటీపై వస్తున్నవన్నీ ఊహాగానాలు మాత్రమేనని లగడపాటి చెప్పారు.