Bonthu Rammohan: కేటీఆర్ సీఎం ఎప్పుడు అవుతారు..? జీహెచ్ఎంసీ మేయర్ బొంతు సమాధానం ఏంటంటే..?

|

Feb 02, 2021 | 9:52 AM

సమయం వచ్చినప్పుడు కేటీఆర్ సీఎం అవుతారని అన్నారు జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్. మంగళవారం ఉదయం ఆయన కుటుంబసమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు.

Bonthu Rammohan:  కేటీఆర్ సీఎం ఎప్పుడు అవుతారు..? జీహెచ్ఎంసీ మేయర్ బొంతు సమాధానం ఏంటంటే..?
Follow us on

Bonthu Rammohan: సమయం వచ్చినప్పుడు కేటీఆర్ సీఎం అవుతారని అన్నారు జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్. మంగళవారం ఉదయం ఆయన కుటుంబసమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. భగవంతుని కృపతో సందర్భం వచ్చినప్పుడు కేటీఆర్ సీఎం అవుతారనేది తన అభిప్రాయం అని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ సమిష్టి నిర్ణయంతోనే కేటీఆర్ సీఎం అవుతారన్నారు. బంగారు తెలంగాణ సాధనకు మరింత శక్తిని ప్రసాదించాలని శ్రీవారిని ప్రార్థించానని తెలియజేశారు. బొంతు రామ్మోహన్ వెంట వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కూడా ఉన్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ స్థానంలో కేటీఆర్ బాధ్యతలు స్వీకరిస్తారని అధికార పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదేం కొత్త కాకపోయినప్పటికీ.. ఇటీవలి కాలంలో ఈ ప్రచారం ఊపందుకుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్, బీజేపీ నేతలు.. ఇలా అందరూ కేటీఆర్ సీఎం కాబోతున్నారని చెబుతున్నారు. ఫిబ్రవరిలో కేటీఆర్‌కు పట్టాభిషేకం జరుగుతుందనే వార్తలు సైతం వెలువడుతున్నాయి. లెట్స్ వెయిట్ అండ్ సీ.

Also Read:

Atchannaidu Arrest : ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్ట్.. నిమ్మాడలో అదుపులోకి తీసుకున్న పోలీసులు

Ap Local Body Elections 2nd-Phase Nominations Live Updates: మరికాసేపట్లో ప్రారంభంకానున్న రెండో విడత నామినేషన్ల ప్రక్రియ