జమ్మలమడుగులో భారీగా పోలింగ్‌

| Edited By:

Apr 11, 2019 | 9:02 PM

జమ్మలమడుగు నియోజకవర్గం మరోసారి రికార్డు నెలకొల్పింది. జమ్మలమడుగులో భారీగా పోలింగ్‌ నమోదైంది. సాయంత్రంవరకు జమ్మలమడుగులో 79 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు. పోలింగ్‌ శాతం మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. పోలింగ్ సమయం ముగిసిన తర్వాత కూడా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఇప్పటివరకు కేంద్రాల వద్ద క్యూలో ఉన్న ఓటర్లకు అధికారులు అవకాశం కల్పించారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 64 శాతం పోలింగ్‌ నమోదైంది. భారీ పోలింగ్ నమోదు కావడంతో […]

జమ్మలమడుగులో భారీగా పోలింగ్‌
Follow us on

జమ్మలమడుగు నియోజకవర్గం మరోసారి రికార్డు నెలకొల్పింది. జమ్మలమడుగులో భారీగా పోలింగ్‌ నమోదైంది. సాయంత్రంవరకు జమ్మలమడుగులో 79 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు. పోలింగ్‌ శాతం మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. పోలింగ్ సమయం ముగిసిన తర్వాత కూడా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఇప్పటివరకు కేంద్రాల వద్ద క్యూలో ఉన్న ఓటర్లకు అధికారులు అవకాశం కల్పించారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 64 శాతం పోలింగ్‌ నమోదైంది. భారీ పోలింగ్ నమోదు కావడంతో టీడీపీ, వైసీపీలు తమదే విజయమని ధీమాగా ఉన్నాయి. టీడీపీ నుంచి రామసుబ్బారెడ్డి, వైసీపీ నుంచి సుధీర్‌రెడ్డి బరిలో ఉన్నారు. తర తరాలుగా ఉన్న పగలకు స్వస్తి చెప్పి రామసుబ్బారెడ్డి, మంత్రి ఆదినారాయణరెడ్డి కుటుంబాలు కలవడంతో జమ్మలమడుగు ఎన్నికపై మరింత ఆసక్తి నెలకొంది. రామసుబ్బారెడ్డి జమ్మలమడుగు ఎమ్మెల్యే అభ్యర్థిగా, ఆదినారాయణరెడ్డి కడప పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న టీడీపీ నేతలు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.