GHMC Election Results 2020 : గ్రేటర్ ఓటరు అనూహ్య తీర్పు.. ఏపార్టీకీ దొరకని పూర్తిస్థాయి మెజార్టీ

|

Dec 05, 2020 | 6:05 AM

జీహెచ్ఎంసీ 2020 ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి పూర్తిస్థాయిలో మెజార్టీ రాలేదు. అతిపెద్ద పార్టీగా టీఆర్ఎస్‌ అవతరించినప్పటికీ.., మ్యాజిక్‌ ఫిగర్‌కు దూరంగానే..

GHMC Election Results 2020 : గ్రేటర్ ఓటరు అనూహ్య తీర్పు.. ఏపార్టీకీ దొరకని పూర్తిస్థాయి మెజార్టీ
Follow us on

జీహెచ్ఎంసీ 2020 ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి పూర్తిస్థాయిలో మెజార్టీ రాలేదు. అతిపెద్ద పార్టీగా టీఆర్ఎస్‌ అవతరించినప్పటికీ.., మ్యాజిక్‌ ఫిగర్‌కు దూరంగానే ఉంది. మొత్తం 150 డివిజన్లు ఉన్న బల్దియాలో మేయర్ పీఠం కైవసం చేసుకోవాలంటే 76 స్థానాల్లో విజయం సాధించాలి. ఐతే.. గ్రేటర్ ఎన్నికల్లో 55 డివిజన్లు కైవసం చేసుకున్న టీఆర్ఎస్ అతిపెద్ద పార్టీగా నిలిచింది. బీజేపీ 48 చోట్ల గెలిచింది. ఎంఐఎం 44 డివిజన్లు కైవసం చేసుకుంది. దీంతో గ్రేటర్ మేయర్ పీఠం దక్కడం ఎక్స్ అఫీషియో సభ్యులు కీలకం కానున్నారు. మొత్తం.. 52 మంది ఎక్స్ అఫీషియో సభ్యులను కలుపుకుంటే మేయర్ ఎన్నికలో ఓటేసే వారి సంఖ్య 202కి చేరుతుంది. దీంతో మేయర్ పీఠం దక్కించుకోవాలంటే 102 మేజిక్ ఫిగర్ అవసరం ఉంటుంది.

మొత్తం 52 మంది ఎక్స్ అఫీషియో సభ్యుల్లో… టీఆర్‌ఎస్‌కు అధికంగా 37 మంది, బీజేపీకి ముగ్గురు, కాంగ్రెస్‌కు ఒక్కరు, ఎంఐఎంకు 10 మంది ఉన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలిచిన టీఆర్ఎస్ కూడా ఎక్స్ అఫీషియో కలుపుకున్నా… మేయర్ పీఠం దక్కించుకోవాలంటే మరో 10 మంది సభ్యుల మద్దతు కావాల్సి ఉంటుంది. అలానే.. ఎంఐఎంకు 10 మంది, బీజేపీకి ముగ్గురు, కాంగ్రెస్‌కు ఒక్కరు మాత్రమే ఎక్స్‌అఫీషియో సభ్యులు ఉన్నారు. బీజేపీకి మేయర్ పీఠం దక్కాలంటే… మరో 50 మంది వరకు సభ్యుల మద్దతు అవసరం ఉంటుంది.