నియమావళి ఉల్లంగిస్తే కఠిన చర్యలు- ద్వివేది

|

Apr 09, 2019 | 8:20 PM

అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రచారం ముగిసిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలక‌ృష్ణ ద్వివేది తెలిపారు. ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నాయకులు ప్రలోభాలకు దిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తులు ఆ ప్రాంతంలో ఉండకూడదని.. బయట వ్యక్తులు వాళ్ల ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేశామని.. నగదు, మద్యం, కానుకల స్వాధీనంలో ఏపీ రెండో స్థానంలో […]

నియమావళి ఉల్లంగిస్తే కఠిన చర్యలు- ద్వివేది
Follow us on

అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రచారం ముగిసిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలక‌ృష్ణ ద్వివేది తెలిపారు. ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నాయకులు ప్రలోభాలకు దిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తులు ఆ ప్రాంతంలో ఉండకూడదని.. బయట వ్యక్తులు వాళ్ల ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేశామని.. నగదు, మద్యం, కానుకల స్వాధీనంలో ఏపీ రెండో స్థానంలో ఉందన్నారు. రాజకీయ పార్టీలు ఈ రెండు రోజులు సహకరించాలని కోరారు. పోలింగ్‌ కేంద్రాలకు ఎలక్ట్రానిక్‌ పరికారాలు నిషేధం ఉన్నందున.. సెల్‌ఫోన్‌లు తీసుకుని రావద్దని విజ్ఞప్తి చేశారు. ఓటరు కార్డు లేని వారు ఎన్నికల సంఘం అనుమతించిన పదకొండు రకాల గుర్తింపు కార్డులో ఏదో ఒకటి తెచ్చుకోవచ్చునని సూచించారు. రెండోసారి ఓటు వేస్తూ పట్టుబడితే మూడేళ్ల జైలు శిక్ష తప్పదని ద్వివేది హెచ్చరించారు.