గరంగరంగా గన్నవరం.. ఇంతకీ ఏం జరుగుతోందంటే ?

| Edited By: Pardhasaradhi Peri

Nov 20, 2019 | 9:55 PM

గన్నవరం రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. త్వరలోనే వైసీపీలో చేరబోతున్న వల్లభనేని వంశీ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ వైసీపీ సీనియర్ నేతలను కలవడం హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు యార్లగడ్డ వెంకట్రావు జగన్‌తో జరిపిన భేటీ తరువాత.. సీఎం నిర్ణయం మేరకు నడుచుకుంటానని ప్రకటించారు. దాంతో ఇప్పుడు గన్నవరంలో ఒకటే చర్చ జరుగుతోంది. యార్లగడ్డ వెంకట్రావు.. జగన్ ఆదేశాల మేరకు వల్లభనేని వంశీతో కలిసి పనిచేస్తారా? ఇద్దరు కలిసి పనిచేసేందుకు అనుకూలంగా వెంకట్రావుకు జగన్ ఏం హామీ […]

గరంగరంగా గన్నవరం.. ఇంతకీ ఏం జరుగుతోందంటే ?
Follow us on

గన్నవరం రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. త్వరలోనే వైసీపీలో చేరబోతున్న వల్లభనేని వంశీ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ వైసీపీ సీనియర్ నేతలను కలవడం హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు యార్లగడ్డ వెంకట్రావు జగన్‌తో జరిపిన భేటీ తరువాత.. సీఎం నిర్ణయం మేరకు నడుచుకుంటానని ప్రకటించారు. దాంతో ఇప్పుడు గన్నవరంలో ఒకటే చర్చ జరుగుతోంది. యార్లగడ్డ వెంకట్రావు.. జగన్ ఆదేశాల మేరకు వల్లభనేని వంశీతో కలిసి పనిచేస్తారా? ఇద్దరు కలిసి పనిచేసేందుకు అనుకూలంగా వెంకట్రావుకు జగన్ ఏం హామీ ఇచ్చారు? ఈ చర్చ గన్నవరంలో జోరుగా జరుగుతోంది.

గన్నవరం రాజకీయాలు గరం గరంగా మారుతూ రోజుకో మలుపు తిరుగుతున్నాయి. టిడిపికి రాజీనామా చేసిన వంశీ..జగన్ వెంట నడుస్తానని ప్రకటించారు. త్వరలోనే వైసీపీలో చేరతానని చెప్పారు. అయితే పక్కా డేట్‌ మాత్రం ప్రకటించలేదు. సీఎం నిర్ణయం మేరకు తన చేరిక ఉంటుందని తెలిపారు.

ఈ నేపథ్యంలో గన్నవరం రాజకీయాలు చర్చనీయాంశంగా మారాయి. ఇటు వైసీపీలో చేరేందుకు వంశీ రెడీ అవుతున్నారనే సిగ్నల్స్‌ వస్తున్నాయి. మరోవైపు నియోజకవర్గంలో వైసీపీ సీనియర్ నేత దుట్టా రామచంద్రరావుతో వంశీ భేటీ కావడం హాట్ టాపిక్ గా మారింది. వంశీ వైసీపీలో చేరడానికి ముహూర్తం ఖరారు అయ్యిందని.. అందులో భాగంగానే వైసీపీ నేతల్ని కలుస్తున్నారని అనుకుంటున్నారు. భవిష్యత్‌లో ఇబ్బందులు రాకుండా వారితో కలిసి పని చేసేందుకు ముందుగానే వారితో భేటీ అవుతున్నారట.

మరోవైపు వైసీపీ గన్నవరం ఇన్‌ఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావు జిల్లా మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలతో కలిసి సీఎం జగన్‌తో భేటీ అయ్యారు.. వంశీని పార్టీలోకి చేర్చుకోవడంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో పార్టీ కోసం తాను కష్టపడ్డానని, వైసీపీ కార్యకర్తలపై వంశీ గతంలో కేసులు పెట్టించి వేధించారని ఆయన జగన్ వద్ద ప్రస్తావించారు. వంశీ వైసీపీలో చేరినా.. నీ రాజకీయ భవిష్యత్ నేను చూసుకుంటానని, జగన్ యార్లగడ్డకు భరోసా ఇచ్చారని తెలుస్తోంది. వంశీ పార్టీలోకి వచ్చే విషయం తనకు తెలియదని, జగన్ నాయకత్వంలోనే తాను పని చేస్తానని, వైసీపీలోనే ఉంటానని యార్లగడ్డ ప్రకటించారు.

వంశీ పార్టీలోకి వస్తే..యార్లగడ్డ, వంశీ ఇద్దరూ కలిసి పని చేస్తారా? కేడర్ కలిసి పోతుందా అనే చర్చ జరుగుతోంది. ఒక వేళ ఉప ఎన్నికలు వస్తే ఎమ్మెల్యే టికెట్ హామీ జగన్ ఎవరికి ఇచ్చారని ప్రచారం నడుస్తోంది. ఒకరికి ఎమ్మెల్యే టికెట్, మరొకరికి ఎమ్మెల్సీ ఇస్తారని ఆ మేరకు ఒప్పందం కుదిరిందనే ప్రచారం జరుగుతోంది. వంశీ పార్టీలోకి వచ్చిన తర్వాత స్పందిస్తానని యార్లగడ్డ అంటున్నారు. వంశీ అధికారికంగా వైసీపీ కండువా కప్పుకుంటే ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనే ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.