Vundavalli Arun Kumar: బీజేపీకి అన్ని పార్టీలు మద్దతివ్వడం చాలా విచిత్రంగా ఉంది.. జగన్‌, చంద్రబాబు ప్రభుత్వాలకు పెద్ద తేడా లేదు..

|

May 24, 2022 | 7:46 PM

ఇవాళ ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. బీజేపీ సిద్ధాంతాలు నచ్చినా నచ్చకపోయినా మిగతా పార్టీల వాళ్లంతా వెళ్లి కమలంలో చేరుతున్నారన్నారు. ఏపీలో అయితే వైసీపీ, టీడీపీ, జనసేన... అనే తేడా లేకుండా అన్ని పార్టీల నుంచి..

Vundavalli Arun Kumar: బీజేపీకి అన్ని పార్టీలు మద్దతివ్వడం చాలా విచిత్రంగా ఉంది.. జగన్‌, చంద్రబాబు ప్రభుత్వాలకు పెద్ద తేడా లేదు..
22
Follow us on

దేశంలో, రాష్ట్రంలో విచిత్రమైన రాజకీయ పరిస్థితులు ఏర్పడ్టాయని అంటున్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌(Vundavalli Arun Kumar). ఇవాళ ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. బీజేపీ సిద్ధాంతాలు నచ్చినా నచ్చకపోయినా మిగతా పార్టీల వాళ్లంతా వెళ్లి కమలంలో చేరుతున్నారన్నారు. ఏపీలో అయితే వైసీపీ, టీడీపీ, జనసేన… అనే తేడా లేకుండా అన్ని పార్టీల నుంచి బీజేపీకి మద్దతివ్వడం ఒక విచిత్రమైన పరిణామం అంటున్నారు ఉండవల్లి. రాజకీయాల్లోకి మతాన్ని తీసుకొచ్చి వివాదం చేయొద్దని ఆయన హితవు పలికారు.  అసలు మనం ఎటుపోతున్నామో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. చదువుకుంటున్నవాళ్లు కూడా సంకుచితంగా ఆలోచిస్తున్నారు. ప్రపంచం మొత్తం మనల్ని గౌరవిస్తోంది. ఇతర దేశాల వారు కూడా మన సంప్రదాయాలను అమలు చేస్తున్నారు. కాంగ్రెస్‌, ఇతర పార్టీల్లో ఉన్న వారుబీజేపీలోకి వెళ్లడం ఆశ్చర్యం కలుగుతోంది. కేంద్ర, రాష్ట్ర మంత్రులుగా చేసిన వాళ్లు కూడా చేరుతున్నారు. బీజేపీ ఐడియాలజీ తెలియకుండా పదవుల కోసం వెళుతున్నారు. కాంగ్రెస్‌ది సెక్యులరిజం.. కమ్యూనిస్టులు సోషలిజం.. బీజేపీది హిందూయిజం.

అన్ని రంగాల్లో ఫెయిల్యూర్‌ అయిన బీజేపీ.. మతం విషయంలో సక్సెస్‌ అయింది. ఆ పార్టీ సిద్ధాంతం వల్ల మనకు నష్టమే ఎక్కువ. ప్రధాని మోదీ అన్ని విషయాల్లో దెబ్బతిన్నారు. రాష్ట్రంలోని వైసీపీ, టీడీపీ, జనసేన.. ఈ మూడు పార్టీలూ  బీజేపీకే మద్దతిస్తున్నాయి. ఆ పార్టీల నేతలు వాళ్లలో వాళ్లు తిట్టుకుంటారు కానీ.. బీజేపీను ఒక్క మాట కూడా అనరు.

జగన్‌, చంద్రబాబు ప్రభుత్వాలకు పెద్ద తేడా కనిపించడం లేదు. ప్రత్యేకహోదా, పోలవరం, 9, 10 షెడ్యూల్‌ ప్రకారం హైదరాబాద్‌ నుంచి వచ్చే ఆస్తుల విషయంపై అదే పరిస్థితి ఉంది. న్యాయబద్ధంగా రావాల్సినవి అడిగేందుకు ఎందుకు భయపడతారో అర్థం కావట్లేదు. పోలవరం నిర్మాణ బాధ్యతను కేంద్రానికి అప్పగించడంపై ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్‌ ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే దాన్ని మళ్లీ కేంద్రానికి అప్పజెబుతామన్నారు. అధికారంలోకి వచ్చినా జగన్‌ ఎందుకివ్వలేదని అని ఉండవల్లి ప్రశ్నించారు.