టీడీపీలోకి మాజీ మంత్రి కొణతాల..?

| Edited By: Srinu

Mar 06, 2019 | 7:54 PM

పార్టీ మారుతున్నాడంటూ గత కొన్ని రోజులుగా తనపై వస్తున్న ఊహాగానాలకు మంత్రి కొణతాల రామకృష్ణ తెరదించనున్నారు. త్వరలోనే ఆయన టీడీపీ కండువాను కప్పుకోనున్నారు. విశాఖపట్టణం రైల్వే జోన్ సహా ఏపీకి జరుగుతున్న అన్యాయంపై తరచూ గళం విప్పుతున్న ఆయన టీడీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో ఈ నెల 28న ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో సమావేశం కానున్నారు. వచ్చే ఎన్ని్కల్లో అనకాపల్లి నుంచి టీడీపీ తరపున లోక్‌సభ అభ్యర్థిగా కొణతాల బరిలోకి దిగే అవకాశం […]

టీడీపీలోకి మాజీ మంత్రి కొణతాల..?
Follow us on

పార్టీ మారుతున్నాడంటూ గత కొన్ని రోజులుగా తనపై వస్తున్న ఊహాగానాలకు మంత్రి కొణతాల రామకృష్ణ తెరదించనున్నారు. త్వరలోనే ఆయన టీడీపీ కండువాను కప్పుకోనున్నారు. విశాఖపట్టణం రైల్వే జోన్ సహా ఏపీకి జరుగుతున్న అన్యాయంపై తరచూ గళం విప్పుతున్న ఆయన టీడీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో ఈ నెల 28న ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో సమావేశం కానున్నారు. వచ్చే ఎన్ని్కల్లో అనకాపల్లి నుంచి టీడీపీ తరపున లోక్‌సభ అభ్యర్థిగా కొణతాల బరిలోకి దిగే అవకాశం ఉందని సమాచారం. కాగా కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వెళ్లిన కొణతాల, 2014 ఎన్నికల ఫలితాల తరువాత ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు.  అప్పటి నుంచి ఏ పార్టీలోకి వెళ్లని కొణతాల తాజాగా టీడీపీలో చేరబోతున్నారు.