Anil Kumar Yadav: పొత్తులు పెట్టుకుంటారో.. పెళ్లి చేసుకుంటారో.. మాకు అభ్యంతరం లేదు..

|

May 13, 2022 | 11:01 AM

పవన్ కళ్యాణ్, చంద్రబాబు పొత్తులు పెట్టుకుంటారో.. కలిసుంటారో.. పెళ్లి చేసుకుంటారో మాకు అనవసరం.. ఎవరు.. ఎవరితో పొత్తులు పెట్టుకున్నా మాకు అభ్యంతరం..

Anil Kumar Yadav: పొత్తులు పెట్టుకుంటారో.. పెళ్లి చేసుకుంటారో.. మాకు అభ్యంతరం లేదు..
Ex Minister Anil Kumar Yadav
Follow us on

తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు (Chandrababu) ఇక ముఖ్యమంత్రి అయ్యే ప్రసక్తే లేదని ఏపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ సెటైర్లు వేశారు. నెల్లూరు నగరం వెంకటేశ్వర పురంలో ఏపీ మాజీ మంత్రి అనిల్ కుమార్(Anil Kumar Yadav) పర్యటించారు. ఈ సందర్భంగగా అనిల్ కుమార్ మాట్లాడుతూ… సీఎం జగన్ ను నేరుగా ఎదుర్కొనలేక చంద్రబాబు.. పవన్ కళ్యాణ్‌లు (Pawan Kalyan) పొత్తుల గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు పొత్తులు పెట్టుకుంటారో.. కలిసుంటారో.. పెళ్లి చేసుకుంటారో మాకు అనవసరం.. ఎవరు.. ఎవరితో పొత్తులు పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదన్నారు. అయితే.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లకు వారి మీద వారికే నమ్మకం లేదన్నారు. పొత్తుల గురించి మాట్లాడుతున్నారంటే జగన్ ఎంత బలవంతుడో అర్థం అవుతుందన్నారు. సంక్షేమ పథకాలతో ప్రజల మనసుల్లో జగన్ నిలిచిపోయారని.. ఎంతమంది కలిసి వచ్చినా మాకు నష్టం లేదన్నారు.

జగన్మోహన్ రెడ్డిని ఢీకొట్టలేకే ఈ పొత్తులు.. జగన్ అంటే భయపడుతున్నారని అందరికీ అర్ధమవుతోందన్నారు. జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో మీకు భయం పట్టుకుంది. పసి బిడ్డలకు సంబంధించి పేపర్ లీక్ అయితే కేసు కట్టకూడదా.. కేసులు కడితే కక్ష అంటారా.. అంటూ ప్రశ్నించారు. ఎపుడో జరిగిన ఘటనలను ఇప్పు డు వైరల్ చేస్తూ కొన్ని ఛానళ్లు ఆనందం పొందుతున్నాయని ఎద్దేవ చేశారు.