ముఖ్యమంత్రి జగన్ తన చెట్టును తానే నరుక్కుంటున్నారు..!

| Edited By:

Jul 16, 2019 | 12:31 PM

ముఖ్యమంత్రి జగన్ తన చెట్టును తానే నరుక్కుంటున్నారని ఎద్దేవా చేశారు టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. పోలవరం ప్రాజెక్టు విషయంలో విజయసాయి రెడ్డి సీబీఐ విచారణ కోరితే.. కేంద్రం తిరస్కరించిందని గుర్తుచేశారు. పోలవరం పునరావాసం విషయంలో అవకతవకల గురించి బీజేపీ నేతలు ఒకరికొకరు పొంతలేని విధంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. జీవీఎల్ పోలవరం అవకతవకల గురించి మాట్లాడితే.. పోలవరానికి ఎంత ఇస్తారని రమేష్ అడగడం విడ్డూరంగా ఉందన్నారు. ఒకే పార్టీ నేతలు పొంతన లేకుండా మాట్లాడుతూ రాష్ట్రప్రజలకు అయోమయానికి […]

ముఖ్యమంత్రి జగన్ తన చెట్టును తానే నరుక్కుంటున్నారు..!
Follow us on

ముఖ్యమంత్రి జగన్ తన చెట్టును తానే నరుక్కుంటున్నారని ఎద్దేవా చేశారు టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. పోలవరం ప్రాజెక్టు విషయంలో విజయసాయి రెడ్డి సీబీఐ విచారణ కోరితే.. కేంద్రం తిరస్కరించిందని గుర్తుచేశారు.

పోలవరం పునరావాసం విషయంలో అవకతవకల గురించి బీజేపీ నేతలు ఒకరికొకరు పొంతలేని విధంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. జీవీఎల్ పోలవరం అవకతవకల గురించి మాట్లాడితే.. పోలవరానికి ఎంత ఇస్తారని రమేష్ అడగడం విడ్డూరంగా ఉందన్నారు. ఒకే పార్టీ నేతలు పొంతన లేకుండా మాట్లాడుతూ రాష్ట్రప్రజలకు అయోమయానికి గురిచేస్తున్నారన్నారు.

మరోవైపు ఇప్పటికీ కూడా పోలవరం ప్రాజెక్టుకు ఫైనాన్స్ క్లియరెన్స్ రాలేదన్నారు. ఆర్‌ అండ్ ఆర్‌ ప్యాకేజీ.. రాష్ట్ర పరిధిలోనిదే అని కేంద్రం వాదిస్తున్న విషయాన్ని కూడా గుర్తు చేశారు చంద్రబాబు. కియా పరిశ్రమను వైఎస్ తెచ్చారని అధికార పార్టీ నేతలు అసెంబ్లీలో చెప్పడం చూస్తుంటే.. ఎంతకు బరితెగించారో తెలిసిపోతుందన్నారు. పట్టిసీమ నీళ్లు మచిలీపట్నానికి ఉపయోగపడలేదనడం.. వారి అవివేకానికి నిదర్శనమన్నారు. మరోవైపు గోదావరికే కృష్ణానది నీళ్లను తీసుకెళ్తున్నట్టు వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు చంద్రబాబు.

ఇదిలావుండగా.. సదావర్తి భూములపై అసెంబ్లీలో చర్చ జరిగిన సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు బినామీలు చెన్నైలో భూములు కొన్నారని ఆరోపించారు. నాటి ప్రభుత్వం వాటిని తక్కువ ధరకు అమ్మారని కోర్టు కూడ పేర్కొందని అన్నారు. భూముల అమ్మకంపై వాస్తవాలు బయటకు రావాలని, విజిలెన్స్ చేత విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. సదావర్తి భూములపై విచారణ జరిపిస్తామని ప్రకటించారు.