నాకు అన్యాయం జరిగింది.. సుప్రీం మెట్లెక్కిన తేజ్ బహదూర్

| Edited By:

May 06, 2019 | 4:56 PM

ఎన్నికల సంఘం తన అభ్యర్థిత్వాన్ని రద్దు చేయడంపై వారణాసి ఎస్పీ అభ్యర్ధి, బీఎస్‌ఎఫ్ మాజీ జవాను తేజ్‌బహదూర్ యాదవ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన సమర్పించిన నామినేషన్ పత్రాల్లో తేడాలు ఉన్న కారణంగా తిరస్కరిస్తున్నట్టు రిటర్నింగ్ అధికారులు పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే తన నామినేషన్ విషయంలో తనకు అన్యాయం జరిగిందని ఆరోపించిన తేజ్ బహదూర్.. ఈసీ నుంచి సమాధానం కోసం వేచిచూడకుండానే రిటర్నింగ్ అధికారి తన నామినేషన్ పత్రాలను తిరస్కరించారని పేర్కొన్నారు. ఈ నియోజకవర్గంలో అధికార పార్టీ […]

నాకు అన్యాయం జరిగింది.. సుప్రీం మెట్లెక్కిన తేజ్ బహదూర్
Follow us on

ఎన్నికల సంఘం తన అభ్యర్థిత్వాన్ని రద్దు చేయడంపై వారణాసి ఎస్పీ అభ్యర్ధి, బీఎస్‌ఎఫ్ మాజీ జవాను తేజ్‌బహదూర్ యాదవ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన సమర్పించిన నామినేషన్ పత్రాల్లో తేడాలు ఉన్న కారణంగా తిరస్కరిస్తున్నట్టు రిటర్నింగ్ అధికారులు పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే తన నామినేషన్ విషయంలో తనకు అన్యాయం జరిగిందని ఆరోపించిన తేజ్ బహదూర్.. ఈసీ నుంచి సమాధానం కోసం వేచిచూడకుండానే రిటర్నింగ్ అధికారి తన నామినేషన్ పత్రాలను తిరస్కరించారని పేర్కొన్నారు. ఈ నియోజకవర్గంలో అధికార పార్టీ అభ్యర్ధికి ప్రయోజనం కల్పించేందుకే ఈ పక్షపాతం చూపారని ఆయన సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో ఆరోపించారు.