ఎంపీ అరవింద్‌ను నిలదీసిన పసుపు రైతులు.. సమాధానం చెప్పలేక ముఖం చాటేసిన బీజేపీ ఎంపీ

|

Jan 23, 2021 | 4:09 PM

పసుపు చోర్డు ఎర్పాటు విషయంలో రైతులను మోసం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు పసుపుబోర్డు హామీపై గెలుపొందిన ఎంపీ ఆరవింద్ వెంటనే తన పదవికి రాజినామా చేయాలని..

ఎంపీ అరవింద్‌ను నిలదీసిన పసుపు రైతులు.. సమాధానం చెప్పలేక ముఖం చాటేసిన బీజేపీ ఎంపీ
Follow us on

నిజమాబాద్: కమ్మరపల్లి మండలం చౌట్ పల్లిలో ఎంపి అభ్యర్థులుగా గత పార్లమెంట్ ఎన్నికలలో నామినేషన్ వేసిన పసుపు రైతుల సమవేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంపీ అరవింద్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామన్న హామీ ఏమైందని ఎంపీని పసుపు రైతులు నిలదీశారు.

పసుపు చోర్డు ఎర్పాటు విషయంలో రైతులను మోసం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు పసుపుబోర్డు హామీపై గెలుపొందిన ఎంపీ ఆరవింద్ వెంటనే తన పదవికి రాజినామా చేయాలని డిమాండ్ చేశారు. మద్దతు ధర విషయంలోనూ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని ఎంపీపై ఆగ్రహం వ్యక్తం చేశాఉ. ఈ నేపథ్యంలో పసుపుకు రూ.15 వేల మద్దతు దర ఇప్పిస్తానని తాను చెప్పలేదని ఎంపీ చేతులెత్తేశారు.

పసుపుకు రూ.15 వేల మద్దతు ధర, పసుపు బోర్డు ఆలస్యం విషయంలో ఎంపీకి రైతుల సూటిగా ప్రశ్నలు గుప్పించారు. ఎంపీగా గెలిపిస్తే 5 రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని చెప్పి ఎందుకు తేలేదని ఎంపీని రైతులు నిలదీశారు. కనీసం రూ. 15 వేల మద్దతు ధర ఇప్పించడంలో ఎంపీ విఫలమయ్యారని ఎంపీ ఎదుటే వాపోయారు.

రాసిచ్చిన బాండ్ పేపర్ కు సమాధానం చెప్పుతావా లేక రాజీనామా చేసి రైతులతో కలిసి ఉద్యమంలో పాల్గొంటావా అంటూ అరవింద్‌ను రైతులు హామీల వీడియో చూపిస్తూ మరీ నిలదీశారు. అయితే తాను రాసిచ్చిన బాండ్ పేపర్‌లో నిర్ణీత సమయం గానీ, మద్దతు ధర గానీ చెప్పలేదని ఎంపీ అరవింద్‌ దాటవేశారు.