ఫేస్‌బుక్ యూజర్లకు డీజీపీ గౌతమ్ సవాంగ్ వార్నింగ్: సీఎం జగన్‌పై..

| Edited By: Pardhasaradhi Peri

Aug 06, 2019 | 9:08 AM

ఏపీ సీఎం జగన్‌పై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టింగులు పెట్టిన ఇద్దరి వ్యక్తులను జగ్గయ్యపేట పోలీసులు అరెస్ట్ చేశారు. జగ్గయ్యపేటకు చెందిన అవినాష్, గోపీలపై కేసు నమోదు చేశారు. వీరిని అరెస్ట్ చేసి.. కోర్టులో హాజరుపరిచగా.. రెండు వారాలపాటు రిమాండ్ విధించమని కోర్టు ఆదేశం ఇచ్చింది. వీరిలో అవినాష్ తన ఫేస్‌బుక్ ఖాతా నుంచి సీఎం జగన్‌పై అసభ్యకరమైన పోస్టు చేయగా.. గోపీ వాటిని షేర్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా డీజీపీ గౌతమ్ సవాంగ్ […]

ఫేస్‌బుక్ యూజర్లకు డీజీపీ గౌతమ్ సవాంగ్ వార్నింగ్: సీఎం జగన్‌పై..
Follow us on

ఏపీ సీఎం జగన్‌పై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టింగులు పెట్టిన ఇద్దరి వ్యక్తులను జగ్గయ్యపేట పోలీసులు అరెస్ట్ చేశారు. జగ్గయ్యపేటకు చెందిన అవినాష్, గోపీలపై కేసు నమోదు చేశారు. వీరిని అరెస్ట్ చేసి.. కోర్టులో హాజరుపరిచగా.. రెండు వారాలపాటు రిమాండ్ విధించమని కోర్టు ఆదేశం ఇచ్చింది.

వీరిలో అవినాష్ తన ఫేస్‌బుక్ ఖాతా నుంచి సీఎం జగన్‌పై అసభ్యకరమైన పోస్టు చేయగా.. గోపీ వాటిని షేర్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా డీజీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ.. ఇలా.. ప్రముఖులపై అసభ్యకరమైన పోస్టులు పెట్టి కేసుల్లో ఇరుక్కోవద్దని సూచించారు. ముఖ్యంగా యువతను ఇలాంటి పనులకు స్వస్తి చెప్పాలని.. ఇలా అసభ్యకరమైన పోస్టులను షేర్ చేయడం కూడా నేరం కిందే పరిగణించబడుతుందని హెచ్చరించారు. గతంలో చిత్తూరుకు చెందిన ఓ యువకుడిని ఇలా.. పోస్టుల విషయంలో జైలుపాలయ్యాడని తెలిపారు గౌతమ్ సవాంగ్.