Congress President: జ‌న‌వ‌రి 22న కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీ స‌మావేశం.. పార్టీ చీఫ్ ఎన్నిక‌పై క‌స‌ర‌త్తు

| Edited By:

Jan 21, 2021 | 8:42 AM

జ‌న‌వ‌రి 22న కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం జరుగనుంది. పార్టీ అధ్య‌క్షుడి ఎన్నికే ప్ర‌ధాన అంశంగా ఈ స‌మావేశం సాగ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

Congress President: జ‌న‌వ‌రి 22న కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీ స‌మావేశం.. పార్టీ చీఫ్ ఎన్నిక‌పై క‌స‌ర‌త్తు
Follow us on

జ‌న‌వ‌రి 22న కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం జరుగనుంది. పార్టీ అధ్య‌క్షుడి ఎన్నికే ప్ర‌ధాన అంశంగా ఈ స‌మావేశం సాగ‌నున్న‌ట్లు తెలుస్తోంది. కాగా, సీడబ్ల్యూసీ సభ్యులు సంస్థాగత ఎన్నికల, ఏఐసీసీ ప్లీనరి సమావేశాల షెడ్యూల్‌ను ఈ సంద‌ర్భంగా ఖరారు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మధుసూదన్ మిస్త్రీ అధ్యక్షతన కేంద్ర ఎన్నికల అథారిటీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధమేనంటూ సోనియాకు తెలుపడంతో పాటు పలు సిఫారసులు చేసిందని సమాచారం. ఈ మేరకు సీడబ్ల్యూసీ సమావేశం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

వ‌ర్చువ‌ల్ విధానంలో…

కాంగ్రెస్ కోర్ క‌మిటీగా భావించే సీడ‌బ్ల్యూసీ సమావేశం పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అధ్యక్షతన వర్చువల్‌ విధానంలో జరుగనుంది. కాగా, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌లంతా పార్టీ అధ్యక్ష పదవితో సహా సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్నారు. అయితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆశాజ‌న‌క ఫ‌లితాలు రాక‌పోవ‌డంతో రాహుల్ గాంధీ రాజీనామా చేయడంతో సోనియా గాంధీ తాతాల్కి కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు పార్టీకి పూర్తికాల అధ్యక్షుడి నియమించాలని, అలాగే సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని పార్టీ ముఖ్య నేతలు డిమాండ్‌ చేస్తూ లేఖ రాసిన విషయం తెలిసిందే.