వాళ్ళ కుట్రను అడ్డుకున్నాం.. రవిశంకర్ ప్రసాద్

మహారాష్ట్రలో శివసేన-కాంగ్రెస్, శరద్ పవార్ నేతృత్వం లోని ఎన్సీపీ కూటమి దొడ్డిదారిన అధికారాన్ని చేజిక్కించుకునేందుకు కుట్ర పన్నిందని, దాన్ని బీజేపీ అడ్డుకుందని ఈ పార్టీ నేత, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ఎక్కువ సీట్లను గెలుచుకున్న తమ పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరించిందని, అలాంటప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సత్తా తమకే ఉందని శివసేన ఎలా ప్రకటించుకుంటుందని ఆయన ప్రశ్నించారు. బీజేపీకి అనుకూలంగా స్పష్టమైన ప్రజా తీర్పు ఉన్నప్పుడు ఈ ‘ అపవిత్ర కూటమి […]

వాళ్ళ కుట్రను అడ్డుకున్నాం.. రవిశంకర్ ప్రసాద్
Follow us

| Edited By: Srinu

Updated on: Nov 23, 2019 | 6:43 PM

మహారాష్ట్రలో శివసేన-కాంగ్రెస్, శరద్ పవార్ నేతృత్వం లోని ఎన్సీపీ కూటమి దొడ్డిదారిన అధికారాన్ని చేజిక్కించుకునేందుకు కుట్ర పన్నిందని, దాన్ని బీజేపీ అడ్డుకుందని ఈ పార్టీ నేత, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ఎక్కువ సీట్లను గెలుచుకున్న తమ పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరించిందని, అలాంటప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సత్తా తమకే ఉందని శివసేన ఎలా ప్రకటించుకుంటుందని ఆయన ప్రశ్నించారు. బీజేపీకి అనుకూలంగా స్పష్టమైన ప్రజా తీర్పు ఉన్నప్పుడు ఈ ‘ అపవిత్ర కూటమి ‘ ని ఆపి వేయాల్సిందే అని ఆ రాష్ట్ర ప్రజలు గళమెత్తుతున్నారని ఆయన పేర్కొన్నారు. ‘ వ్యక్తిగత ప్రయోజనాల కోసం సేన తన విలువలను కాలరాస్తోందని, దేవేంద్ర ఫడ్నవీస్ పట్ల ప్రజలకు మంచి అభిప్రాయాలు ఉన్న కారణంగానే ఆ పార్టీ అభ్యర్థులు లాభపడ్డారని (ఎన్నికల్లో గెలిచారని) రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యానించారు. ప్రతి[పక్షంలో కూర్చుంటామని కాంగ్రెస్, ఎన్సీపీలే ప్రకటించుకున్నాయి. మరి.. అధికారాన్ని చేజిక్కించుకునేందుకు హఠాత్తుగా ఈ ‘ మ్యాచ్ ఫిక్సింగ్ ‘ ఏమిటి ‘ అని కూడా ఆయన ప్రశ్నించారు. ఇదిలా ఉండగా.. ఈనెల 30 న దేవేంద్ర ఫడ్నవీస్ అసెంబ్లీలో తన మెజారిటీని నిరూపించుకోవచ్ఛునని తెలుస్తోంది.’ ఆ రాష్ట్ర శాసన సభలో సమయం వచ్చినప్పుడు మా బలం ప్రూవ్ చేసుకుంటాం’ అని రవిశంకర్ ప్రసాద్ ధీమాగా చెప్పారు.