చిరుత ఫుడ్ లేకుండా ఎంతకాలం బతుకుతుందో తెలుసా..?
TV9 Telugu
03 May 2024
చిరుత పులి చాలా వేగంగా పరుగెడుతుంది. తన ఆహారం కోసం ఎంత దూరమైన వెళ్తుంది. అంతే వేగంగా దాడి చేస్తుంది.
అడవిలో ఉండే జంతువుల్లో అత్యంత వేగవంతమైనది చిరుత. అవి దాదాపు 3 సెకన్లలో 112కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలవు.
2012లో అమెరికా జూలో ఓ చిరుత 5.95 సెకన్లలో 100 మీటర్లు పరిగెత్తింది. వేటను లక్ష్యంగా చేసుకుంటే, 300 మీటర్ల దూరంలోనే వాటిని చంపేస్తాయి.
చిరుతపులి గరిష్టంగా 1.30 నిమిషాల పాటు అదే వేగంతో పరుగెత్తగలదు. సాధారణంగా ఒక చిరుత 40 నుంచి 45 కిలోల బరువు ఉంటుంది.
అందుకే అది సులభంగా.. వేగంగా పరిగెత్త గలదు. చిరుతలు ఎక్కువగా పగటిపూట వేటాడతాయి. వేడి ఎండలో విశ్రాంతి తీసుకుంటాయి.
పక్షులను, కుందేళ్లును చిరుతలు వేటాడవు. చిరుతలు ఆహారం లేకుండా సాధారణంగా 5 నుండి 6 రోజులు జీవించగలవు.
చిరుతపులులు నీరు లేకుండా రెండు రోజులు బతుకుతాయి. సాధారణంగా ఇవి నివసించడానికి చాలా ఎక్కువ స్థలం కావాలి.
చిరుతపులి 43 రోజుల్లో దాదాపు 300 కిలోమీటర్లు దూరం ప్రయాణిస్తుంది. తన సహజ స్థితిలో జీవించడానికి దాదాపు 800 చదరపు కిలోమీటర్ల అడవి అవసరం.
ఇక్కడ క్లిక్ చెయ్యండి