హైదరాబాద్‌లో రాహుల్ గాంధీ పర్యటన

| Edited By:

Mar 09, 2019 | 10:42 AM

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈరోజు హైదరాబాద్‌లో పర్యటిస్తారు. ముందుగా.. నోవాటెల్ హాటల్లో పార్టీ ముఖ్యనేతలతో భేటీ అవుతారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సీనియర్ నేతలతో చర్చిస్తారు రాహుల్. తర్వాత.. సాయంత్రం నాలుగున్నరకి శంషాబాద్ క్లాసిక్ కన్వెన్షన్ సెంటర్ సమీపంలోని గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన ఆదాయ వాగ్ధాన సభలో రాహుల్ పాల్గొంటారు. తెలంగాణాలో ఢీలా పడ్డ కాంగ్రెస్.. పుంజుకోవడానికి రాహుల్ ఎలాంటి ఫార్ములా అప్లై చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. బెంగుళూరు నుంచి స్పెషల్ ఫ్లైట్లో […]

హైదరాబాద్‌లో రాహుల్ గాంధీ పర్యటన
Follow us on

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈరోజు హైదరాబాద్‌లో పర్యటిస్తారు. ముందుగా.. నోవాటెల్ హాటల్లో పార్టీ ముఖ్యనేతలతో భేటీ అవుతారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సీనియర్ నేతలతో చర్చిస్తారు రాహుల్. తర్వాత.. సాయంత్రం నాలుగున్నరకి శంషాబాద్ క్లాసిక్ కన్వెన్షన్ సెంటర్ సమీపంలోని గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన ఆదాయ వాగ్ధాన సభలో రాహుల్ పాల్గొంటారు. తెలంగాణాలో ఢీలా పడ్డ కాంగ్రెస్.. పుంజుకోవడానికి రాహుల్ ఎలాంటి ఫార్ములా అప్లై చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

బెంగుళూరు నుంచి స్పెషల్ ఫ్లైట్లో సాయంత్రం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ చేరుకుంటారు. రాహుల్. నాలుగు గంటలకు ముఖ్య నేతలతో భేటీ అవుతారు. నాలుగున్నరకు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆరున్నర గంటలకు తిరికి ఎయిర్ పోర్టుకు చేరుకొని.. ఢిల్లీకి వెళ్తారు. రాహుల్ రాక సందర్భంగా హాస్తం పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.