బీజేపీలో చేరనున్న వడివేలు..!

| Edited By:

Oct 20, 2020 | 4:40 PM

తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. దీంతో అన్ని రాజకీయ పార్టీలు తమ వ్యూహాలను అమలు చేస్తున్నాయి.

బీజేపీలో చేరనున్న వడివేలు..!
Follow us on

Comedian Vadivelu BJP: తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. దీంతో అన్ని రాజకీయ పార్టీలు తమ వ్యూహాలను అమలు చేస్తున్నాయి. ఇక ఆ రాష్ట్రంలో తమ ప్రాబల్యాన్ని పెంచుకోవాలనుకుంటోన్న బీజేపీ కోలీవుడ్‌ తారలకు గాలం వేస్తోంది. ఈ క్రమంలో కొన్నేళ్లుగా కాంగ్రెస్‌లో కొనసాగిన ఖుష్బూ.. ఇటీవల బీజేపీ కండువాను కప్పుకున్నారు. ఇక ప్రముఖ నటుడు విజయ్ తండ్రి చంద్రశేఖర్‌ కూడా బీజేపీలో చేరుతారని వార్తలు వచ్చినప్పటికీ.. వాటిని ఆయన ఖండించారు.

అయితే తాజాగా ప్రముఖ కమెడియన్ వడివేలు బీజేపీలో చేరబోతున్నట్లు తమిళనాట జోరుగా పుకార్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన కొందరు వడివేలుతో సంప్రదింపులు జరిపారని, త్వరలోనే ఆయన కాషాయ కండువాను కప్పుకుంటారని తెలుస్తోంది. అయితే రాజకీయాలు వడివేలుకు కొత్తేం కాదు. 2011లో డీఎంకే పార్టీ తరఫున ఆయన ప్రచారం చేశారు. అయితే అప్పుడు డీఎంకే ఓడిపోవడంతో ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

Read More:

Official: ప్రభాస్ ‘రాధేశ్యామ్’‌కి మ్యూజిక్ డైరెక్టర్ కన్ఫర్మ్‌

Bigg Boss 4: వివాదాస్పద సింగర్ వైల్డ్‌కార్డు ఎంట్రీ..!