‘వరల్డ్ బ్యాంక్’ వెనక్కి తగ్గడానికి కారణం.. జగన్..!

| Edited By:

Jul 19, 2019 | 12:02 PM

‘వరల్డ్ బ్యాంక్’ వెనక్కి తగ్గడానికి కారణం.. సీఎం జగన్మోహన్ రెడ్డినే అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. మీడియా పాయింట్‌లో మాట్లాడిన చంద్రబాబు.. సీఎం జగన్‌పై ఆరోపణ వర్షం కురిపించారు. రైతుల పేరుతో ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదులు పెట్టించారని అన్నారు. ఇకపై ఆంధ్రప్రదేశ్‌లోని ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ప్రపంచ బ్యాంక్ నిధులు కేటాయించదని.. దానికి జగన్ తగిన మూల్యం చెల్లించవలసి ఉంటుందని విమర్శించారు. జగన్‌కు అభివృద్ధి అవసరం లేదని.. […]

వరల్డ్ బ్యాంక్ వెనక్కి తగ్గడానికి కారణం.. జగన్..!
Follow us on

‘వరల్డ్ బ్యాంక్’ వెనక్కి తగ్గడానికి కారణం.. సీఎం జగన్మోహన్ రెడ్డినే అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. మీడియా పాయింట్‌లో మాట్లాడిన చంద్రబాబు.. సీఎం జగన్‌పై ఆరోపణ వర్షం కురిపించారు. రైతుల పేరుతో ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదులు పెట్టించారని అన్నారు. ఇకపై ఆంధ్రప్రదేశ్‌లోని ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ప్రపంచ బ్యాంక్ నిధులు కేటాయించదని.. దానికి జగన్ తగిన మూల్యం చెల్లించవలసి ఉంటుందని విమర్శించారు. జగన్‌కు అభివృద్ధి అవసరం లేదని.. పులివెందుల గొడవలే ఇక్కడ కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఇసుక దొరక్క రేటు రెండింతలు పెరిగిపోయిందని..దీంతో.. నిర్మాణ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని.. పని దొరక్క రోజు కూలీలు రోడ్డున పడుతున్నారని అన్నారు చంద్రబాబు.