ప్రజావేదిక కూల్చివేతపై సుప్రీంకోర్టుకెక్కుతాం..?

| Edited By: Pardhasaradhi Peri

Jun 26, 2019 | 11:21 AM

వివాదంగా మారిన ప్రజావేదిక కూల్చివేతపై టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు తొలిసారిగా స్పందించారు. ఈ చర్య అక్రమమన, నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చివేతకు ఆదేశాలు ఇవ్వడమేంటని ప్రశ్నించిన ఆయన.. ప్రభుత్వ చర్యను సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని ప్రకటించారు. ఉండవల్లిలోని తన నివాసం ముందుగానే పలు ఆశ్రమాలు, ఇళ్లు, ఇతర కట్టడాలు ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించుకునే ప్రజావేదిక కూల్చివేత పనులు చట్ట విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. ఉండవల్లి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రజావేదిక కూల్చివేత […]

ప్రజావేదిక కూల్చివేతపై సుప్రీంకోర్టుకెక్కుతాం..?
Follow us on

వివాదంగా మారిన ప్రజావేదిక కూల్చివేతపై టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు తొలిసారిగా స్పందించారు. ఈ చర్య అక్రమమన, నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చివేతకు ఆదేశాలు ఇవ్వడమేంటని ప్రశ్నించిన ఆయన.. ప్రభుత్వ చర్యను సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని ప్రకటించారు. ఉండవల్లిలోని తన నివాసం ముందుగానే పలు ఆశ్రమాలు, ఇళ్లు, ఇతర కట్టడాలు ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించుకునే ప్రజావేదిక కూల్చివేత పనులు చట్ట విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.

ఉండవల్లి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రజావేదిక కూల్చివేత కొనసాగుతూ ఉండటంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నంలోపు ప్రజావేదికను పూర్తిగా కూల్చేస్తామని అధికారులు చెప్తున్నారు.