హైదరాబాద్‌కు అమిత్‌ షా.. పలువురు నేతలు జంప్..?

| Edited By: Pardhasaradhi Peri

Jul 06, 2019 | 6:56 PM

రేపు హైదరాబాద్‌‌కు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వస్తున్నారు. అధికార పగ్గాలు చేపట్టాక రెండోసారి అమిత్‌ షా హైదరాబాద్‌ రానున్నారు. శనివారం శంషాబాద్‌లో జరిగే పార్టీ రాష్ట్రస్థాయి నేతల సమావేశంలో పాల్గొనేందుకు హైదరాబాద్ రానున్న అమిత్‌ షా. ఈ సందర్భంగా పలువురు ముఖ్య నేతలతో భేటీ అవుతారు. బీజేపీ బలోపేతం దృష్ట్యా ఆయన ఇక్కడ పర్యటిస్తారని సమాచారం. అయితే.. అమిత్‌ షా హైదరాబాద్‌కు రావడంతో పలువురు పార్టీ నేతలు బీజేపీలో చేరబోతున్నారని ఊహాగానాలు ప్రస్తుతం చక్కర్లు […]

హైదరాబాద్‌కు అమిత్‌ షా.. పలువురు నేతలు జంప్..?
Follow us on

రేపు హైదరాబాద్‌‌కు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వస్తున్నారు. అధికార పగ్గాలు చేపట్టాక రెండోసారి అమిత్‌ షా హైదరాబాద్‌ రానున్నారు. శనివారం శంషాబాద్‌లో జరిగే పార్టీ రాష్ట్రస్థాయి నేతల సమావేశంలో పాల్గొనేందుకు హైదరాబాద్ రానున్న అమిత్‌ షా. ఈ సందర్భంగా పలువురు ముఖ్య నేతలతో భేటీ అవుతారు. బీజేపీ బలోపేతం దృష్ట్యా ఆయన ఇక్కడ పర్యటిస్తారని సమాచారం. అయితే.. అమిత్‌ షా హైదరాబాద్‌కు రావడంతో పలువురు పార్టీ నేతలు బీజేపీలో చేరబోతున్నారని ఊహాగానాలు ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నాయి. తమ పార్టీలపై అసమ్మతిగా ఉన్న నేతలతో బీజేపీ ముఖ్య నేతలు మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది. అయితే.. వీరి చేరికపై ఇంకా స్పష్టత రాలేదు.