Cases against politicians: కేసీఆర్‌పై 13.. జగన్‌పై 38.. నేతలపై కేసుల చిట్టా ఇదే..!

| Edited By:

Feb 14, 2020 | 10:31 AM

Cases against politicians: ప్రజాప్రతినిధుల కేసుల వివరాలకు సంబంధించిన లిస్ట్ బయటికొచ్చింది. వీరిపై ఉన్న కేసుల వివరాలను వెబ్‌సైట్‌లో పెట్టాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి.. తెలంగాణ సీఎం కేసీఆర్‌పై 13 కేసులు, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై 38కేసులు ఉన్నాయి. అంతేకాదు అన్ని ప్రముఖ పార్టీల్లోనూ పలువురిపై కేసులు నమోదయ్యాయి. ఆ లిస్ట్‌ ప్రకారం తెలంగాణలో టీఆర్ఎస్-51, కాంగ్రెస్- 21, ఎంఐఎం- 7, బీజేపీ- 5, టీటీడీపీ- ఇద్దరిపై.. ఏపీలో […]

Cases against politicians: కేసీఆర్‌పై 13.. జగన్‌పై 38.. నేతలపై కేసుల చిట్టా ఇదే..!
Follow us on

Cases against politicians: ప్రజాప్రతినిధుల కేసుల వివరాలకు సంబంధించిన లిస్ట్ బయటికొచ్చింది. వీరిపై ఉన్న కేసుల వివరాలను వెబ్‌సైట్‌లో పెట్టాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి.. తెలంగాణ సీఎం కేసీఆర్‌పై 13 కేసులు, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై 38కేసులు ఉన్నాయి. అంతేకాదు అన్ని ప్రముఖ పార్టీల్లోనూ పలువురిపై కేసులు నమోదయ్యాయి.

ఆ లిస్ట్‌ ప్రకారం తెలంగాణలో టీఆర్ఎస్-51, కాంగ్రెస్- 21, ఎంఐఎం- 7, బీజేపీ- 5, టీటీడీపీ- ఇద్దరిపై.. ఏపీలో వైసీపీ- 86, టీడీపీ- 15మందిపై కేసులు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో నమోదైన కేసులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. వాటికి సంబంధించి మంత్రులు హరీష్ రావుపై అత్యధికంగా 41, కేటీఆర్‌పై 17 కేసులు ఉన్నాయి. సీఎం కేసీఆర్‌పై 13 తెలంగాణ ఉద్యమ కేసులు నమోదయ్యాయి. అలాగే ఆత్రంసక్కు-13, రోహిత్ రెడ్డి-8, చిరుమూర్తి లింగయ్య-8, ఎర్రబెల్లి-5, కోమటిరెడ్డి-4, గంగుల కమలాకర్-3, దానం-4, సబిత-4, రాజాసింగ్-17, అక్బరుద్దీన్-8, జగ్గారెడ్డిలపై 9 కేసులు ఉన్నాయి.

మరోవైపు ఏపీలో వైసీపీకి చెందిన 86మంది ఎమ్మెల్యేలు, 9మంది ఎంపీలు, 15మంది టీడీపీ నేతలపై కేసులు నడుస్తున్నాయి. ఉదయభాను- 18, చెవిరెడ్డి- 15, దాడిశెట్టి రాజా-17, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి-7, కేతిరెడ్డి పెద్దారెడ్డి-8, విజయసాయి-13, జక్కంపూడి రాజా-6, ఆర్కే-7, మాధవ్-2, అవినాశ్ రెడ్డి-4, రఘురాంకృష్ణంరాజుపై 6 కేసులు నడుస్తున్నాయి. మరోవైపు టీడీపీకి చెందిన కరణం బలరాం-2, చంద్రబాబు-1, బనగాని సత్యప్రసాద్-1, అచ్చెన్నాయుడు-1, వాసుపల్లి గణేష్‌పై 3 కేసులు నమోదయ్యాయి.