హింసాత్మకంగా మారిన వెస్ట్ బెంగాల్ ఎన్నికలు

| Edited By:

May 12, 2019 | 11:26 AM

ఆరో దశ ఎన్నికల్లో కూడా పశ్చిమ బెంగాల్‌లో ఘర్షణలు తలెత్తాయి. బీజేపీ అభ్యర్ధి భారతీఘోష్ వాహనంపై తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లతో దాడికి దిగారు. ఈ ఘటనలో సెక్యూరిటీ సిబ్బందికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా, శనివారం గోపివల్లబ్‌పూర్‌లో బీజేపీ కార్యకర్తను గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చారు. దీంతో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. కాగా వెస్ట్ మిడ్నాపూర్ నియోజకవర్గంలోని భగబన్‌పూర్‌లో ఇద్దరు బీజేపీ కార్యకర్తలపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ […]

హింసాత్మకంగా మారిన వెస్ట్ బెంగాల్ ఎన్నికలు
Follow us on

ఆరో దశ ఎన్నికల్లో కూడా పశ్చిమ బెంగాల్‌లో ఘర్షణలు తలెత్తాయి. బీజేపీ అభ్యర్ధి భారతీఘోష్ వాహనంపై తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లతో దాడికి దిగారు. ఈ ఘటనలో సెక్యూరిటీ సిబ్బందికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా, శనివారం గోపివల్లబ్‌పూర్‌లో బీజేపీ కార్యకర్తను గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చారు. దీంతో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. కాగా వెస్ట్ మిడ్నాపూర్ నియోజకవర్గంలోని భగబన్‌పూర్‌లో ఇద్దరు బీజేపీ కార్యకర్తలపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు బీజేపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. తృణమూల్‌ కాంగ్రెస్సే ఈ ఘటనలకు కారణమని బీజేపీ ఆరోపిస్తోంది. అయితే టీఎంసీ మాత్రం బీజేపీ ఆరోపణలను కొట్టిపారేసింది.