వైసీపీ నేతలకు ‘బిగ్‌ టాస్క్ ఇచ్చిన బాస్’

| Edited By: Pardhasaradhi Peri

Aug 10, 2019 | 3:37 PM

ఏపీలో వైసీపీ నేతలకు సీఎం జగన్ ఓ బిగ్ టాస్క్‌ ఫిక్స్ చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి.. కొత్త ఐడియాలతో ముందుకు దూసుకెళ్తున్నారు. విమర్శలను పట్టించుకోకుండా తన పనిని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ సందర్భంగానే.. వైసీపీ నేతలకు కూడా సీఎం ఓ టార్గ్‌ట్ ఇచ్చినట్టు సమాచారం. అక్టోబర్ 15 తర్వాత ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో.. స్థానిక ఎన్నికల్లో ప్రతిభ చూపించిన వారికి నామినేటెడ్ పదవులు […]

వైసీపీ నేతలకు బిగ్‌ టాస్క్ ఇచ్చిన బాస్
Follow us on

ఏపీలో వైసీపీ నేతలకు సీఎం జగన్ ఓ బిగ్ టాస్క్‌ ఫిక్స్ చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి.. కొత్త ఐడియాలతో ముందుకు దూసుకెళ్తున్నారు. విమర్శలను పట్టించుకోకుండా తన పనిని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ సందర్భంగానే.. వైసీపీ నేతలకు కూడా సీఎం ఓ టార్గ్‌ట్ ఇచ్చినట్టు సమాచారం. అక్టోబర్ 15 తర్వాత ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో.. స్థానిక ఎన్నికల్లో ప్రతిభ చూపించిన వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ప్రతి నియోజకవర్గంలో ఎవరు ఎలా పనిచేస్తున్నారు..? ప్రజల్లోకి వెళ్తున్నారా లేదా..? సమస్యలను సత్వరంగా పరిష్కరిస్తున్నారా..? లేదా అనేది.. సర్వే చేసి.. వారికి నామినేటెడ్ పదవులను ఇవ్వబోతున్నట్టు సమాచారం.

కాగా.. చాలా విషయాల్లో సీఎం జగన్.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది. జగన్.. అన్ని విషయాల్లోనూ ఆచి.. తూచి అడుగు వేస్తున్నారు. ఈ క్రమంలో.. మొదటి నుంచీ పార్టీ కోసం పని చేసేవారికి, అలాగే.. పార్టీలో కొత్తగా చేరిన వారికి కూడా.. జగన్ కొన్ని హామీలు ఇచ్చారు. అయితే.. సీఎం జగన్ ఇజ్రాయెల్ టూర్‌ తర్వాత.. ఎవరైతే.. ప్రజల్లోకి వెళ్తారో.. ప్రతిభను చూపిస్తారో.. వారికే నామినేటెడ్‌ పదవులు కట్టబెట్టే అవకాశం ఉందనే.. పుకారు.. షికారు చేస్తోంది. కానీ.. ప్రస్తుతం నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తే.. పదవులు దక్కని వారు పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే అవకాశం కూడా ఉంది. ఈ క్రమంలో జగన్.. ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇటు.. వైసీపీ నేతలు కూడా.. వారి వారి ప్రాంతాల్లోని సమస్యలపై దృష్టి పెట్టారని సమాచారం. చూడాలి మరి.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏం జరగనుందో..!