మళ్లీ ఢిల్లీకి ఏపీ సీఎం..?

| Edited By:

May 20, 2019 | 12:08 PM

ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ ఢిల్లీ బయలుదేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు ఇతర ప్రాంతీయ పార్టీల నేతలను వరుసగా కలుస్తూ.. ఎప్పటికప్పుడు మారుతోన్న రాజకీయపరిణామాలపై చర్చిస్తున్న చంద్రబాబు… ఇవాళ మరోసారి ఢిల్లీ వెళ్లి.. వివిధ పార్టీల నేతలతో భేటీ అవుతారని సమాచారం. బీఎస్పీ అధినేత్రి మాయావతితో కూడా ఆయన సమావేశం కానున్నారు. అలాగే.. కోల్‌కతా వెళ్లి మళ్లీ దీదీతో ఆయన భేటీ అవుతారని టీడీపీ వర్గాలు తెలిపాయి. ఎగ్జిట్ పోల్స్, ఫలితాల తర్వాత అనుసరించాల్సిన […]

మళ్లీ ఢిల్లీకి ఏపీ సీఎం..?
Follow us on

ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ ఢిల్లీ బయలుదేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు ఇతర ప్రాంతీయ పార్టీల నేతలను వరుసగా కలుస్తూ.. ఎప్పటికప్పుడు మారుతోన్న రాజకీయపరిణామాలపై చర్చిస్తున్న చంద్రబాబు… ఇవాళ మరోసారి ఢిల్లీ వెళ్లి.. వివిధ పార్టీల నేతలతో భేటీ అవుతారని సమాచారం. బీఎస్పీ అధినేత్రి మాయావతితో కూడా ఆయన సమావేశం కానున్నారు. అలాగే.. కోల్‌కతా వెళ్లి మళ్లీ దీదీతో ఆయన భేటీ అవుతారని టీడీపీ వర్గాలు తెలిపాయి. ఎగ్జిట్ పోల్స్, ఫలితాల తర్వాత అనుసరించాల్సిన వ్యూహాలపై చంద్రబాబు చర్చించనున్నారు. రిజల్ట్స్ రోజు రాష్ట్రపతి కోవింద్‌ను కలిసే అవకాశముందని ఈ వర్గాలు పేర్కొన్నాయి.

కాగా.. సీఎం కోల్‌కతాకు పయనమయ్యే ముందు టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏపీలో టీడీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. అసెంబ్లీలో 110 స్థానాలతో టీడీపీ గెలుపు ప్రారంభమవుతుందన్న చంద్రబాబు.. 18 నుంచి 20 ఎంపీ స్థానాలు గెలుస్తామని భరోసా వ్యక్తం చేశారు. నూటికి నూరు శాతం ప్రభుత్వం మళ్లీ మనదే అని ధీమా వ్యక్తం చేశారు. సులభంగా నిర్వహించాల్సిన ఎన్నికల్ని ఈసీ గందరగోళం చేసిందని ఆరోపించారు. ఎన్నికల సంఘం తీరుపై రేపు ఢిల్లీలో ధర్నా చేయబోతున్నట్టు చంద్రబాబు ప్రకటించారు.