హాట్‌ హాట్‌గా ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..!

| Edited By: Srinu

Jul 10, 2019 | 4:11 PM

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సెషన్ హాట్ హాట్‌గా జరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి. పోటాపోటీగా శ్వేతపత్రాలతో అధికార, విపక్షాలు రెడీ అవుతోన్నాయి. రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సెషన్ ఎజెండాను ఖరారు చేసేందుకు ఇవాళ జరిగిన బీజేపీ సమావేశంలోనే అధికార, విపక్షాల నేతలు తమతమ ఎంజెండాలకు ప్రాధాన్యతనివ్వాలని పట్టుపట్టారు. కరువుతో పాటు వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య జరుగుతున్న ఘర్షణలపై చర్చించాలని టీడీపీ పట్టుబట్టింది. అయితే.. కరువుతో పాటు వ్యవసాయ రంగ దుస్థితికి కారణమెవరనే విషయంపై చర్చకు […]

హాట్‌ హాట్‌గా ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..!
Follow us on

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సెషన్ హాట్ హాట్‌గా జరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి. పోటాపోటీగా శ్వేతపత్రాలతో అధికార, విపక్షాలు రెడీ అవుతోన్నాయి. రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సెషన్ ఎజెండాను ఖరారు చేసేందుకు ఇవాళ జరిగిన బీజేపీ సమావేశంలోనే అధికార, విపక్షాల నేతలు తమతమ ఎంజెండాలకు ప్రాధాన్యతనివ్వాలని పట్టుపట్టారు. కరువుతో పాటు వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య జరుగుతున్న ఘర్షణలపై చర్చించాలని టీడీపీ పట్టుబట్టింది. అయితే.. కరువుతో పాటు వ్యవసాయ రంగ దుస్థితికి కారణమెవరనే విషయంపై చర్చకు అధికార పక్షం అంగీకరించింది.

ఈ నెల 30వ తేదీ వరకు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనేది బీఏసీ సమావేశాలో నిర్ణయించారు. మొత్తం 14 రోజులు సభ జరుగుతుంది. శని, ఆదివారాలు సెలవు ఉంటుంది. శుక్రవారం సభలో ఆర్థికమంత్రి బుగ్గున రాజేంధ్రనాథ్ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. మరోవైపు తమ కార్యకర్తలపై జరుగుతున్న దాడులు, కరువు, విత్తనాల సరఫరాపై సభలో చర్చించాలని బీఏసీలో డిమాండ్ చేసింది టీడీపీ.