రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ

| Edited By:

Jun 14, 2019 | 1:18 PM

రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కొత్త ప్రభుత్వంలో మొదటి అసెంబ్లీ సమావేశాలకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం ఐదు రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. రేపు ఉదయం 11 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కానుంది. ముందుగా ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఇక ఎల్లుండి జరగబోయే అసెంబ్లీ సమావేశంలో స్పీకర్‌గా తమ్మినేని సీతారాంను ఎన్నుకోనున్నారు. తరువాత ఈనెల 14న జరిగే ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. 15, 16వ తేదీల్లో […]

రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ
Follow us on

రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కొత్త ప్రభుత్వంలో మొదటి అసెంబ్లీ సమావేశాలకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం ఐదు రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. రేపు ఉదయం 11 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కానుంది. ముందుగా ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఇక ఎల్లుండి జరగబోయే అసెంబ్లీ సమావేశంలో స్పీకర్‌గా తమ్మినేని సీతారాంను ఎన్నుకోనున్నారు. తరువాత ఈనెల 14న జరిగే ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. 15, 16వ తేదీల్లో శాసనసభకు సెలవులు కాగా, తిరిగి 17, 18న అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. ఇక ఈనెల 18తో సమావేశాలు ముగుస్తాయి.