రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై అమిత్​ షా కసరత్తు

| Edited By: Pardhasaradhi Peri

Jun 11, 2019 | 5:19 PM

మహారాష్ట్ర, ఝార్ఖండ్,​ హరియాణా రాష్ట్రాల బీజేపీ ముఖ్య నేతలతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. మూడు రాష్ట్రాల్లో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల సీఎంలతో విడివిడిగా సమావేశమయ్యారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో భేటీ జరిగింది. ఈ సమావేశంలో ఆయా రాష్ట్రాల్లోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై అమిత్ షా ఆరా తీశారు. అలాగే రాబోయే ఎన్నికల్లో బీజేపీ అనుసరించాల్సిన వ్యూహాలపై కమలనాథులతో చర్చించినట్లు తెలుస్తోంది. […]

రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై అమిత్​ షా కసరత్తు
Follow us on

మహారాష్ట్ర, ఝార్ఖండ్,​ హరియాణా రాష్ట్రాల బీజేపీ ముఖ్య నేతలతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. మూడు రాష్ట్రాల్లో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల సీఎంలతో విడివిడిగా సమావేశమయ్యారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో భేటీ జరిగింది. ఈ సమావేశంలో ఆయా రాష్ట్రాల్లోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై అమిత్ షా ఆరా తీశారు. అలాగే రాబోయే ఎన్నికల్లో బీజేపీ అనుసరించాల్సిన వ్యూహాలపై కమలనాథులతో చర్చించినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఈ మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీనే అధికారంలో ఉంది. సమావేశంలో పాల్గొన్న మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు పై ధీమా వ్యక్తం చేశారు. మిత్రపక్షాలతో కలిసి మరోసారి అధికారాన్ని దక్కించుకుంటామని ప్రకటించారు. ఝార్ఖండ్, హరియానా ముఖ్యమంత్రులు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.