రేపే ఆరో దశ ఎన్నికలు..సర్వం సిద్ధం చేసిన ఈసీ

|

May 11, 2019 | 2:47 PM

దేశ వ్యాప్తంగా రేపు ఆరో విడత సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 10 కోట్ల మంది ఓటర్లు ఓటు వేయబోతున్నారు. ఢిల్లీ, హర్యానాలో ఆసక్తికర పోరు ఉంది. 6 రాష్ట్రాలు, 1 కేంద్ర పాలిత ప్రాంతంలో మొత్తం 59 స్థానాలకు పోలింగ్‌ జరగబోతోంది. మొత్తం 979 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఆరో దశలో బీహార్‌, జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, హర్యానా రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతమైన ఢిల్లీలో ఎన్నికలు జరగబోతున్నాయి. వీటితో పాటు […]

రేపే ఆరో దశ ఎన్నికలు..సర్వం సిద్ధం చేసిన ఈసీ
Follow us on

దేశ వ్యాప్తంగా రేపు ఆరో విడత సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 10 కోట్ల మంది ఓటర్లు ఓటు వేయబోతున్నారు. ఢిల్లీ, హర్యానాలో ఆసక్తికర పోరు ఉంది. 6 రాష్ట్రాలు, 1 కేంద్ర పాలిత ప్రాంతంలో మొత్తం 59 స్థానాలకు పోలింగ్‌ జరగబోతోంది. మొత్తం 979 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఆరో దశలో బీహార్‌, జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, హర్యానా రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతమైన ఢిల్లీలో ఎన్నికలు జరగబోతున్నాయి. వీటితో పాటు త్రిపురలోని వెస్ట్‌ త్రిపుర నియోజకవర్గంలో 168 పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌ జరగనుంది. ఈ దశ కోసం 59 స్థానాల్లో లక్షా 13 వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల దగ్గర సీసీ కెమెరాలు అమర్చారు. బీహార్‌లో 8, హర్యానాలో 10, జార్ఖండ్‌లో 4, మధ్యప్రదేశ్‌లో 8, ఉత్తరప్రదేశ్‌లో 14, పశ్చిమ బెంగాల్‌లో 8, ఢిల్లీలోని మొత్తం 7 లోక్ సభ స్థానాలకూ ఆరో దశలో పోలింగ్ జరగబోతోంది.