పోలింగ్ కేంద్రంలోనే అధికారికి గుండెపోటు.. ఆస్పత్రికి తరలించేలోపే..

| Edited By:

Apr 18, 2019 | 5:18 PM

కాంకెర్: రెండోదశ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఛత్తీస్‌గఢ్‌లోని కాంకెర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పోలింగ్ నిర్వహిస్తుండగా ఓ ఉపాధ్యాయుడికి గుండెపోటు రావడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు తూకాలు రామ్ నేరేటిగా గుర్తించారు. కాంకెర్ ప్రాంతంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఆయన ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఇవాళ కాంకెర్ లోక్‌సభ నియోజకవర్గంలోని అంటాగఢ్ ప్రాంతంలో పోలింగ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఉదయం 6గంటల సమయంలో పోలింగ్ జరుగుతుండగా ఛాతీలో నొప్పివస్తోందంటూ పోలింగ్ కేంద్రంలోనే ఆయన కుప్పకూలారు. వెంటనే […]

పోలింగ్ కేంద్రంలోనే అధికారికి గుండెపోటు.. ఆస్పత్రికి తరలించేలోపే..
Follow us on

కాంకెర్: రెండోదశ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఛత్తీస్‌గఢ్‌లోని కాంకెర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పోలింగ్ నిర్వహిస్తుండగా ఓ ఉపాధ్యాయుడికి గుండెపోటు రావడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు తూకాలు రామ్ నేరేటిగా గుర్తించారు. కాంకెర్ ప్రాంతంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఆయన ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఇవాళ కాంకెర్ లోక్‌సభ నియోజకవర్గంలోని అంటాగఢ్ ప్రాంతంలో పోలింగ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

ఉదయం 6గంటల సమయంలో పోలింగ్ జరుగుతుండగా ఛాతీలో నొప్పివస్తోందంటూ పోలింగ్ కేంద్రంలోనే ఆయన కుప్పకూలారు. వెంటనే అక్కడి సహచర సిబ్బంది స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆయన మృతి చెందినట్టు స్థానిక అధికారి ఒకరు వెల్లడించారు. నేరేటి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపామనీ… పోలింగ్ కోసం ఆయన స్థానంలో మరో అధికారిని నియమించామని సదరు అధికారి పేర్కొన్నారు. రెండోదశ లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఛత్తీస్‌గఢ్‌లోని మూడు స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.