పాక్ కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘన, భారత్ సీరియస్, దౌత్యాధికారికి సమన్లు జారీ

పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనపై ఇండియా సీరియస్ అయింది. నిన్న పాక్ దళాల కాల్పుల్లో 5 గురు జవాన్లతో సహా 11 మంది మృతి చెందిన ఘటనపై తీవ్రంగా..

  • Umakanth Rao
  • Publish Date - 3:59 pm, Sat, 14 November 20

పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనపై ఇండియా సీరియస్ అయింది. నిన్న పాక్ దళాల కాల్పుల్లో 5 గురు జవాన్లతో సహా 11 మంది మృతి చెందిన ఘటనపై తీవ్రంగా స్పందించిన ప్రభుత్వం పాక్ దౌత్యాధికారికి సమన్లు జారీ చేసింది. దీంతో జవాద్ అలీ అనే అధికారి శనివారం సాయంత్రం విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి జేపీ.సింగ్ తో భేటీ కానున్నారు. భారత. పాకిస్థాన్ దేశాల మధ్య గతంలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఇప్పటికే అనేక సందర్భాల్లో అతిక్రమించిన విషయాన్ని సింగ్..ఆయన దృష్టికి తేనున్నారు.

ఇలా ఉండగా ప్రధాని మోదీ శనివారం జైసల్మీర్ లో సాయుధ దళాలతో కలిసి యుధ్ధ ట్యాంక్ పై కొద్దీ దూరం ప్రయాణించారు.సరిహద్దుల్లో ఏ దేశమైనా ఇండియా పట్ల దురుసుగా ప్రవర్తించిన పక్షంలో దీటుగా సమాధానమిస్తామని ఆయన హెచ్చరించారు. సహనానికి కూడా ఓ హద్దు ఉంటుందని ఆయన చైనా, పాకిస్థాన్ దేశాలకు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు.