Expensive Potato: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బంగాళాదుంప.. కిలో ఆలూ ధరతో కాసు బంగారం కొనచ్చు ఈజీగా

|

Sep 07, 2024 | 5:59 PM

భారతదేశంలో కూరగాయలలో రారాజు అంటే బంగాళదుంప అని అంటారు. దీనికి ఎంత ఆదరణ అంటే ఏడాది పొడవునా దీనిని పిల్లలు, పెద్దలు ఇష్టంగా తింటారు. ఇలాంటి పరిస్థితుల్లో బంగాళదుంప ధర కిలో 20-30 రూపాయలు దాటి ఉంటే.. సామాన్యులకు బాగా ఖరీదుగా భావిస్తారు. అయితే కిలో వేల రూపాయలు అంటే బంగారం ధరతో సమానంగా ఖరీదైన బంగాళదుంప కూడా ఉందని తెలుసా..! అది కూడా ఏడాదిలో కొన్ని రోజులు మాత్రమే దొరుకుంతుంది. ?

1 / 8
బంగాళదుంపలు సాధారణంగా చౌకైన కూరగాయగా పరిగణించబడతాయి. అయితే ఈ స్పెషల్ బంగాళదుంప ధర కిలో 40 నుంచి 50 వేల రూపాయలు! ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బంగాళాదుంపగా ప్రసిద్దిగాంచింది.

2 / 8
మనం మార్కెట్‌కి వెళ్లినప్పుడు ఎవరైనా సరే ఖచ్చితంగా బంగాళదుంప కోసం వెదుకుతారు. అయితే ఈ వెరైటీ బంగాళదుంప మాత్రం అరుదుగా దొరుకుంతుంది. దీని పేరు లే బోనొట్టె బంగాళదుంప. ఫ్రెంచ్ ద్వీపం ఐల్ డి నోయిర్‌మౌటియర్‌లో మాత్రమే దీనిని సాగు చేస్తారు.

3 / 8
ఈ అరుదైన జాతి బంగాళాదుంప దీని ప్రత్యేక సాగు పద్ధతి, అసాధారణమైన రుచికి ప్రసిద్ధి చెందింది. ఈ బంగాళదుంప ఆ ఫ్రెంచ్ ద్వీపంలో 50 చదరపు మీటర్ల ఇసుక నేలలో మాత్రమే పెరుగుతుంది. దాని సాగులో ఆల్గే, సముద్ర మొక్కలను సహజ ఎరువులుగా ఉపయోగిస్తారు. ఫలితంగా ఉప్పు, నిమ్మకాయ రుచితో ఉన్న పులుపు, తేలికపాటి వగరు కలయికతో ఈ బంగాళాదుంపకు ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది.

4 / 8
అంతేకాకుండా ఈ బంగాళాదుంపలను ఒకొక్కటిగా చాలా జాగ్రత్తగా చేతితో తీస్తారు. దీని అధిక ధరకు ఇది కూడా ఒక కారణం. బంగాళాదుంపలను కోయడానికి ఏడు రోజులు వ్యవధి మాత్రమే ఉంటుంది. దాదాపు 2,500 మంది కార్మికులు ఆ తక్కువ సమయంలో మొత్తం బంగాళదుంపలను భూమి నుంచి జాగ్రత్తగా తవ్వి తీస్తారు.

5 / 8
ఈ బంగాళదుంప సంవత్సరంలో 10 రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆ ఫ్రెంచ్ ద్వీపంలో మొత్తం 10,000 టన్నుల బంగాళదుంపలు పండిస్తారు. ఇందులో 100 టన్నుల లే బోనొట్టె బంగాళదుంపలు మాత్రమే సాగు చేస్తున్నారు.

6 / 8
స్థానిక నేల, సముద్రపు నీటి సుగంధాలు లే బోనొట్టె బంగాళాదుంపల తొక్కలలోకి శోషించబడతాయని వ్యవసాయ నిపుణులు అంటున్నారు. అందుకనే దీనికి ప్రత్యేకమైన రుచి ఉన్న అనుభూతిని ఇస్తుంది. కనుక ఈ బంగాళదుంపల పూర్తి రుచిని ఆస్వాదించాలంటే ఈ బంగాళదుంపలను తొక్కతో తినాలి.

7 / 8
ఈ బంగాళాదుంపను ప్రపంచవ్యాప్తంగా ఆహార ప్రియులు, చెఫ్‌లలో రుచికరమైనవిగా పిలుస్తారు. ఈ బంగాళాదుంప అరుదైన, అసాధారణమైన రుచి.. తినే ఆహారానికి లగ్జరీ లుక్ ని ఇస్తుంది.

8 / 8
లే బోనొట్టె బంగాళాదుంపకు ప్రపంచంలోనే అధిక డిమాండ్ ఉన్నా.. సరఫరాలో పరిమితి ఉన్న కారణంగా.. ఈ లే బోనొట్టె  బంగాళదుంపలు సాధారణంగా మార్కెట్లో విక్రయించబడవు. వీటిని వేలం వేసి అమ్ముతారు.