
ఈ ప్రపంచలోనే అత్యధిక జీతం తీసుకునే వ్యక్తుల్లో సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ ఉన్నారు. ఆయన నెల సరి జీతం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కంటే దాదాపు 7 రేట్లు ఎక్కువట. అవును రీసెంట్‌గానే సింగపూర్ ప్రభుత్వం ఆయన వేతనంలో 64 శాతం పెంపును ప్రకటించి. దీంతో 15 అక్టోబర్ 2026 నుండి ఆయన ఏడాది వేతనం 3.6 మిలియన్ సింగపూర్ డాలర్లకు చేరనుంది. అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ. 26 కోట్ల కంటే ఎక్కువే. దీంతో ఆయన ప్రపంచంలోనే అత్యధిక జీతం పొందే నాయకుల జాబితాలో తొలి స్థానంలో నిలవనున్నారు.

ఇక రెండో ప్లేస్‌లో హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాన్ లీ కా-చియు ప్రపంచంలోనే ఎక్కువ జీతం తీసుంకుటున్న రాజకీయ నాయకులలో సెకండ్ ప్లేస్‌లో ఉన్నారు. ఈయన ఏడాది జీతం వచ్చేసి 7.19 లక్షల డాలర్లు. ఇక మూడో ప్లేస్‌లో స్విట్జర్లాండ్ అధ్యక్ష పదవి పొందే వారు ఉండనున్నారు. అయితే ఇక్కడ ఫెడరల్ కౌన్సిల్‌లోని ఏడుగురు సభ్యులు ఒక్కో ఏడాది ఒక్కోరు ఉంటారట.. కాబట్టి ఇక్కడ ఎవరు అధ్యక్షుడు అయితే అతనికి ఏడాది వేతనం దాదాపు 6.06 లక్షల డాలర్లగా ఉంటుందట.

ఇక ప్రపంచలోనే అత్యధిక జీతం తీసుకునే రాజకీయ నాయకుల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాల్గవ స్థానంలో ఉన్నారు. ఈయన అధికారిక వార్షిక వేతనం వచ్చేసి 4 లక్షల డాలర్లు. అయితే అధికారిక జీతం ప్రకారం చూస్తే ట్రంప్ సింగపూర్త అధ్యక్షుడికి కంటే చాలా వెనబడి ఉన్నప్పటికి.. వ్యక్తిగతంగా చూసుకుంటే మాత్రం ట్రంప్ ఆయనకన్నా ఎక్కువే ఉండొచ్చని నివేదికలు చెబుతున్నాయి. నివేదికల ప్రకారం.. ట్రంప్ వ్యక్తిగత ఆదాయం బిలియన్లలో ఉండొచ్చనే సమాచారం.

ఇక ఎక్కవ జీతం తీసుకునే రాజకీయా నాయకుల్లో ఐదో ప్లేస్‌లో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ఉన్నారు. ఆయన వార్షిక వేతనం దాదాపు 3.9 నుండి 4 లక్షల డాలర్ల వరకు ఉంటుంది. అంటే దాదాపు అమెరికా అధ్యక్షుడి అధికారిక వేతనానికి కాస్త దగ్గర్లో ఈయన ఉన్నారు. ఈయను సంబంధిచిన వ్యక్తిగత ఆస్తువల వివరాలు కూడా ఎక్కడా అంత క్లారిటీ ఇవ్వలేదు.

భారత ప్రధాని జీతం ఎంత?: ఇక మన భారత ప్రధాని నరేంద్ర మోదీ వేతనం ఎంత అనే విషయానికి వస్తే.. ఆయన జీతం మన దేశంలోని ఇతర నాయకుల కంటే చాలా తక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. అవును ప్రధానమంత్రికి ప్రతి నెలా దాదాపు రూ. 1.66 లక్షల వేతనం, వివిధ భత్యాలు అందుతాయి. అంటే ఏడాది ఇన్‌కమ్ చూసుకుంటే దాదాపు రూ.20లక్షల వరకు ఉండొచ్చుని అంచనా!