
ఆర్గాన్ ఆయిల్: ఆర్గాన్ ఆయిల్.. దీనినే లిక్విడ్ గోల్డ్ అని కూడా పిలుస్తారు. ఇందులో మన జుట్టు, చర్మ సంరక్షణకు కావాల్సిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ నూనెలో ఉండే ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ E చర్మానికి పోషణ అందించడంతో పాటు తేమను కాపాడతాయి. అలాగే చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచుతాయి. అలాగే ఈ నూనెను జుట్టుకు రాయడం వల్ల జుట్టు చివర్లు చిట్లిపోవడం, చిట్లి ఎగరడం వంటి సమస్యలు తగ్గుతాయి.

స్వీట్ ఆల్మండ్ ఆయిల్: జుట్టు, చర్మ సంరక్షణలో ఈ నూనె కూడా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది చాలా తేలికగా ఉండడం వల్ల చర్మం దీనిని త్వరగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇందులో ఉండే విటమిన్ E పొడిబారిన, చికాకు కలిగిన చర్మానికి తేమను అందించి ఉపశమనం కలిగిస్తుంది. దీన్ని రెగ్యులర్‌గా వాడడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది. అలాగే జుట్టుకు కూడా ఇది స్టాంగ్‌గా ఉంచి మెరుపును అందిస్తుంది.

ఆలివ్ ఆయిల్: ఈ నూనెలో స్క్వాలీన్ అనే సహజ లిపిడ్ ఉంటుంది. ఇది చర్మానికి తేమను అందించి.. దాని సాగే గుణాన్ని కాపాడుతుంది. అలాగే ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మాన్ని రక్షిస్తాయి. ఈ ఆలివ్ ఆయిల్ కేవలం చర్మానికే కాకుండా జుట్టుకు సంరక్షణలో కూడా సహాయపడుతుంది. ఇది జుట్టుకు తేమను అందించి మృదువుగా మారుస్తుంది. అలాగే జుట్టుకు మెరుపును అందిస్తుంది.

అవకాడో ఆయిల్: అవకాడో ఆయిల్లో చర్మ, జుట్టు సంరక్షణకు సహాయపడే విటమిన్ A, D, Eతో పాటు మోనో అన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి జుట్టుకు తేమను అందించి బలంగా మారుస్తాయి. అలాగే జుట్టును కుదుళ్ల నుంచి బలంగా చేసి జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. అలాగే చర్మం పొరబారడాన్ని తగ్గించి చర్మంలో తేమ శాతాన్ని పెంచుతాయి.

చర్మానికి నూనె రాసే విధానం: మీరు చర్మానికి ఈ నూనెలను వాడే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. స్నానం చేసిన తర్వాత చర్మం కొద్దిగా తడిగా ఉన్నప్పుడే మీరు ఈ నూనెను రాసుకోవాలి. అలాగే రాత్రి పడుకునే ముందు కూడా రాసుకోవచ్చు. మీ చర్మతత్వాన్ని బట్టి మీకు ఏ నూనె కావాలో చర్మ వైద్యుల ద్వారా తెలుసుకోండి.( Note: పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్, నివేదికల ఆధారంగా మాత్రమే అందించబడినవి.. వీటిని Tv9 దృవీకరించడం లేదు. వాడే ముందు వైద్యులను సంప్రదించండి.