
శీతాకాలం ప్రారంభం కావడంతో పాటు అనేక రకాల ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతుంటాయి. ముఖ్యంగా ఈ కాలంలో జీర్ణక్రియ మందగించడం వల్ల మలబద్ధకం సమస్య ఎక్కువగా వేధిస్తుంది. దీనిని నివారించడంలో శీతాకాలంలో లభించే క్యాప్సికమ్ ఎంతగానో సహాయపడుతుంది. ఇందులో నీటి శాతం, పీచు పదార్థం పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.

చలికాలంలో తరచూ క్యాప్సికమ్ తినటం వల్ల ప్రేగు కదలికలు సక్రమంగా సాగి మలబద్ధకం నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా బరువు నియంత్రణలో ఉండటానికి, రోగనిరోధక శక్తి పెంపొందడానికి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మరియు రక్తహీనతను నివారించడానికి క్యాప్సికమ్ ఆహారంలో భాగంగా చేసుకోవడం ఎంతో ప్రయోజనకరమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

క్యాప్సికమ్‌లో పీచు పదార్థం అధిక మోతాదులో ఉంటుంది. ఇది ప్రేగు కదలికలను సులభతరం చేసి, శీతాకాలంలో తరచుగా వేధించే మలబద్ధకం సమస్యను సమర్థవంతంగా నివారిస్తుంది. చలికాలంలో శారీరక శ్రమ తగ్గి బరువు పెరిగే అవకాశం ఉంది. అయితే క్యాప్సికమ్‌లో కేలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది బరువును అదుపులో ఉంచుతుంది. ఎక్కువసేపు కడుపు నిండిన భావనను కలిగించి అతిగా తినడాన్ని తగ్గిస్తుంది.

బెల్ పెప్పర్లలో విటమిన్ సి, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కాలానుగుణ వ్యాధులు, ఇన్ఫెక్షన్లతో పోరాడే రోగనిరోధక శక్తిని శరీరానికి అందిస్తాయి. ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే కణాల నష్టాన్ని అడ్డుకుంటాయి. క్యాప్సికమ్‌లో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది గుండె కండరాలను బలోపేతం చేసి, గుండె జబ్బుల ముప్పును తగ్గిస్తుంది.

శరీరంలో ఐరన్ లోపాన్ని తగ్గించడంలో క్యాప్సికమ్ ఎంతగానో తోడ్పడుతుంది. ఇది రక్తహీనత సమస్యను ఎదుర్కొనేందుకు సహజమైన పోషకాలను అందిస్తుంది. శీతాకాలంలో కూరల్లో, సలాలడ్స్‌లో లేదా సూప్స్‌లో క్యాప్సికమ్‌ను భాగం చేసుకోవడం ద్వారా రుచితో పాటు అద్భుతమైన ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.