పాతకాలపు నాటి డ్రింక్.. ఈ ఇంటి పానీయం ఒక్కసారి తాగితే.. చలికాలంలో వేధించే దగ్గు, కఫం పరార్

Updated on: Oct 18, 2026 | 9:15 AM

చలికాలం మొదలు కాగానే చాలామందిని దగ్గు, జలుబు, ఛాతిలో కఫం, గొంతు గరగర వంటి సమస్యలు వేధిస్తుంటాయి. రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారికి ఈ సమస్యలు మరింత ఇబ్బందికరంగా మారుతాయి. తరచుగా మందులు వాడినా పూర్తి ఉపశమనం దొరక్కా నిరాశ చెందుతుంటారు. అయితే, మన ఇంట్లో దొరికే వాటితోనే సులభంగా తయారుచేసుకోగలిగే ఒక అద్భుతమైన పానీయం ఈ సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారం చూపుతుంది.

1 / 5
చలికాలం మొదలు కాగానే చాలామందిని దగ్గు, జలుబు, ఛాతిలో కఫం, గొంతు గరగర వంటి సమస్యలు వేధిస్తుంటాయి. రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారికి ఈ సమస్యలు మరింత ఇబ్బందికరంగా మారుతాయి. తరచుగా మందులు వాడినా పూర్తి ఉపశమనం లభించక నిరాశ చెందుతుంటారు. అయితే, మన ఇంట్లోనే లభించే సహజ సిద్ధమైన పదార్థాలతో సులభంగా తయారుచేసుకోగలిగే ఒక అద్భుతమైన పానీయం ఈ సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారం చూపుతుంది.

2 / 5
పానీయం తయారీకి కావలసిన పదార్థాలు: వెల్లుల్లి రెబ్బలు – 3, మిరియాలు – 10,  లవంగాలు – 10, అల్లం – చిన్న ముక్క
తులసి ఆకులు,   పుదీనా ఆకులు – 10, పసుపు – పావు టీస్పూన్, నీరు – 2 గ్లాసులు తీసుకోవాలి.  ముందుగా ఒక మందపాటి గిన్నెలో రెండు గ్లాసుల నీటిని పోయాలి. ఇప్పుడు ఒక్కొక్కటిగా పైన చెప్పిన వాటిని నీటిలో వేయాలి. వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఇంకా అల్లాన్ని శుభ్రం చేసి చిన్న ముక్కలుగా కట్ చేసి లేదా దంచి వేసుకోవచ్చు. తులసి, పుదీనా ఆకులను కూడా శుభ్రంగా కడిగి వేయాలి. ఆ తర్వాత మిరియాలు, లవంగాలు, పసుపు వేసి, అన్నింటినీ బాగా కలిపి మీడియం ఫ్లేమ్‌లో సుమారు ఐదు నిమిషాల పాటు మరిగించాలి. పానీయం సగం అయ్యే వరకు మరిగించడం మంచిది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, గోరువెచ్చగా ఉన్నప్పుడు వడకట్టి తాగాలి.

పానీయం తయారీకి కావలసిన పదార్థాలు: వెల్లుల్లి రెబ్బలు – 3, మిరియాలు – 10, లవంగాలు – 10, అల్లం – చిన్న ముక్క తులసి ఆకులు, పుదీనా ఆకులు – 10, పసుపు – పావు టీస్పూన్, నీరు – 2 గ్లాసులు తీసుకోవాలి. ముందుగా ఒక మందపాటి గిన్నెలో రెండు గ్లాసుల నీటిని పోయాలి. ఇప్పుడు ఒక్కొక్కటిగా పైన చెప్పిన వాటిని నీటిలో వేయాలి. వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఇంకా అల్లాన్ని శుభ్రం చేసి చిన్న ముక్కలుగా కట్ చేసి లేదా దంచి వేసుకోవచ్చు. తులసి, పుదీనా ఆకులను కూడా శుభ్రంగా కడిగి వేయాలి. ఆ తర్వాత మిరియాలు, లవంగాలు, పసుపు వేసి, అన్నింటినీ బాగా కలిపి మీడియం ఫ్లేమ్‌లో సుమారు ఐదు నిమిషాల పాటు మరిగించాలి. పానీయం సగం అయ్యే వరకు మరిగించడం మంచిది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, గోరువెచ్చగా ఉన్నప్పుడు వడకట్టి తాగాలి.

3 / 5
వెల్లుల్లిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. విటమిన్ B1, B2, B3, B6, C, కాల్షియం, ఐరన్ వంటి ఎన్నో పోషకాలు ఇందులో ఉంటాయి. ఇది జలుబు, దగ్గు, కఫం తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచి, కాలుష్యం నుండి శరీరాన్ని రక్షిస్తుంది. మిరియాలలో విటమిన్ C అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దగ్గు, కఫం, జలుబు, గొంతు నొప్పి, గరగర వంటి గొంతు సంబంధిత సమస్యలకు మిరియాలు చక్కటి ఔషధంగా పనిచేస్తాయి.

4 / 5
లవంగాలలో ఐరన్, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, పొటాషియం, సోడియం, విటమిన్ A వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. గొంతు సంబంధిత సమస్యలు, దగ్గు, కఫం వంటి వాటికి ఇవి దివ్యౌషధంగా పనిచేస్తాయి. అల్లం దగ్గు, కఫం, గొంతు నొప్పి నుండి తక్షణ ఉపశమనం అందిస్తుంది. ఇది జీర్ణ శక్తిని మెరుగుపరిచి, కడుపును తేలికపరుస్తుంది. ఎక్కువ కఫం ఉన్నప్పుడు చిన్న అల్లం ముక్కను నమిలి రసాన్ని మింగడం ద్వారా త్వరగా ఫలితం లభిస్తుంది. తులసి జలుబు, దగ్గు, జ్వరానికి చాలా బాగా పనిచేస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచి, రక్తాన్ని శుద్ధి చేస్తుంది మరియు ఇన్‌ఫెక్షన్లను నయం చేస్తుంది. బీపీ, షుగర్ నియంత్రణకు కూడా సహాయపడుతుంది. పుదీనా శ్వాస సంబంధ సమస్యలకు చక్కని పరిష్కారం. గొంతులో మంట, గొంతు నొప్పి ఉన్నప్పుడు తక్షణ ఉపశమనం ఇస్తుంది. పసుపు ఒక శక్తివంతమైన యాంటీబయాటిక్. జలుబు, దగ్గు, కఫం ఇన్‌ఫెక్షన్ల వల్ల వస్తాయి కాబట్టి, పసుపు వాడకం ఈ ఇన్‌ఫెక్షన్లను తగ్గించి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

5 / 5
ఐదు నుంచి ఆరు రోజులు క్రమం తప్పకుండా ఉదయాన్నే ఈ పానీయాన్ని తాగాలి. దగ్గు, జలుబు లేని వారు కూడా వారానికి కనీసం రెండు రోజులు ఈ పానీయం తాగడానికి ప్రయత్నించాలి. ఇది రోగనిరోధక శక్తిని పెంచి, ఎలాంటి బాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లు సోకకుండా రక్షిస్తుంది. పిల్లలకు మోతాదు తగ్గించి, వారంలో ఒకసారి ఇస్తే సరిపోతుంది. (నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Loading...
Unable to load recommendations.
Follow Us