సిల్క్ దిండు కవర్‌పై నిద్రపోయి చూడండి.. కొద్ది రోజుల్లోనే మీ చర్మం, జుట్టులో కనిపించే అద్భుత మార్పులు ఇవే!

Updated on: Aug 04, 2026 | 7:51 AM

ప్రతి ఒక్కరూ ఉదయాన్నే తాజాగా, కాంతివంతంగా ఉండే ముఖంతో నిద్రలేవాలని కోరుకుంటారు. వారి జుట్టు కూడా పట్టులా మృదువుగా, దువ్వుకోవడానికి అనువుగా, మెరిసేలా కనిపించాలని ఆశిస్తారు. దీని కోసం ప్రజలు నిద్రపోయే ముందు తమ ముఖానికి, జుట్టుకు వివిధ రకరాలైన కెమికల్‌ ఆధారిత ఉత్పత్తులను ఉపయోగిస్తారు. కానీ, మీకు అంత సమయం లేకపోతే, కేవలం మీ దిండు కవర్‌ను మార్చడం వల్ల కూడా మీ చర్మానికి, జుట్టుకు ప్రయోజనం చేకూరుతుంది. సోషల్ మీడియాలో చాలా మంది బ్యూటీ ఇన్‌ఫ్లూయెన్సర్‌లు ఒక సలహా ఇస్తున్నారు. కొద్ది రోజుల పాటు సిల్క్ దిండు కవర్‌పై నిద్రపోయి చూడాలని చెబుతున్నారు. ఈ దిండు కవర్లు మీ జుట్టుకు, ముఖ చర్మానికి ఎలా ప్రయోజనకరంగా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే ముఖం ఎంతో ఫ్రెష్‌గా, గ్లోయింగ్‌గా కనిపించాలని.. జుట్టు సిల్కీగా, చిక్కులు లేకుండా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దీనికోసం రాత్రి పడుకునే ముందు ఎన్నో రకాల క్రీములు, హెయిర్ సిరమ్‌లు వాడుతుంటారు. అయితే, మీ మార్నింగ్ బ్యూటీ రూటీన్‌లో పెద్దగా సమయం కేటాయించకుండానే, కేవలం మీ దిండు కవర్ మార్చడం ద్వారా చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని ఎంతగానో మెరుగుపరచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో బిజినెస్ బ్యూటీ ఇన్‌ఫ్లుయెన్సర్లు, చర్మవ్యాధి నిపుణులు సిల్క్ దిండు కవర్ల వాడకాన్ని ఎక్కువగా సిఫార్సు చేస్తున్నారు. దీని వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలిస్తే మీరు కూడా వెంటనే మీ పాత దిండు కవర్‌ విసిరేస్తారు..హెల్త్‌లైన్ నివేదిక ప్రకారం, కాటన్ కవర్ల కంటే సిల్క్ కవర్ వాడటం వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు ఇవే:

2 / 5
మొటిమలు, పింపుల్స్ నివారిస్తుంది: సిల్క్ గుడ్డ చాలా మృదువుగా, నునుపుగా ఉంటుంది. రాత్రిపూట పడుకున్నప్పుడు ముఖ చర్మానికి, దిండుకు మధ్య ఘర్షణ చాలా తక్కువగా ఉంటుంది. కాటన్ దిండు కవర్లు చర్మంలోని నూనెను, చెమటను పీల్చుకుని బ్యాక్టీరియాకు నిలయంగా మారతాయి. కానీ, సిల్క్ తక్కువ తేమను పీల్చుకోవడం వల్ల దిండు శుభ్రంగా ఉంటుంది. దీనివల్ల సున్నితమైన చర్మం ఉన్నవారికి మొటిమల సమస్య తగ్గుతుంది.

3 / 5
జుట్టు రాలడం, చిక్కుపడటం తగ్గుతుంది: చాలామందికి ఉదయం లేవగానే జుట్టు ఎండిపోయి, తీవ్రంగా చిక్కుపడిపోతుంటుంది. సిల్క్ పిల్లో కవర్‌పై పడుకోవడం వల్ల జుట్టు తేలికగా కదులుతుంది, ఘర్షణ తగ్గడం వల్ల జుట్టు విరిగిపోవడం, ఊడిపోవడం చాలా వరకు తగ్గుతాయి. మీరు బ్లో-డ్రై లేదా ప్రత్యేక హెయిర్ స్టైల్ చేసుకున్నట్లయితే, అది ఎక్కువ కాలం చెడిపోకుండా ఉంటుంది.

4 / 5
స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ పూర్తిగా పనిచేస్తాయి: రాత్రివేళ ముఖానికి రాసుకునే నైట్ క్రీమ్‌లు, సీరమ్‌లు కాటన్ కవర్లకు త్వరగా అంటుకుని వృథా అవుతాయి. కానీ సిల్క్ బట్ట వీటిని పీల్చుకోదు. దీనివల్ల మీరు వాడే సౌందర్య ఉత్పత్తులు మీ చర్మానికి, జుట్టుకు పూర్తిస్థాయిలో మేలు చేస్తాయి.

5 / 5
చర్మంపై ముడతలు రాకుండా నిరోధిస్తుంది: సిల్క్ చర్మాన్ని గుంజకుండా మృదువుగా ఉంచుతుంది. దీనివల్ల వయసు పెరిగే కొద్దీ వచ్చే ఫైన్ లైన్స్, ముడతలు పడకుండా నిరోధించవచ్చు. అంతేకాకుండా, ఇది రాత్రిపూట శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచి, ప్రశాంతమైన నిద్రను అందిస్తుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us