
మెంతులను కేవలం పోపు దినుసులగానే కాకుండా ఒక సూపర్ ఫుడ్‌గా పరిగణించాలి. ఇందులో శరీరానికి అవసరమైన ఫైబర్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ B6 శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.

నానబెట్టిన మెంతులు ఎందుకు?: శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం.. మెంతుల్లోని సాపోనిన్లు, ఫినోలిక్ సమ్మేళనాలు శరీరంలోని వాపును తగ్గించడంలో కీలకంగా పనిచేస్తాయి.రాత్రంతా మెంతి గింజలను నీటిలో నానబెట్టి, ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఆ నీటిని తాగి, గింజలను నమలడం వల్ల పోషకాలు నేరుగా రక్తంలోకి చేరుతాయి.

గుండె - జీర్ణక్రియ: చెడు కొలెస్ట్రాల్ తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ పెంచడంలో మెంతులు సహాయపడతాయి. ఇది ధమనులలో అడ్డంకులను తొలగించి గుండెను పదిలంగా ఉంచుతుంది. అంతేకాకుండా మెంతి నీరు తాగడం వల్ల గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు దూరమవుతాయి. ప్రేగులను శుభ్రంగా ఉంచడం ద్వారా ఇది ముఖానికి సహజమైన మెరుపును ఇస్తుంది.

మధుమేహం - బరువు నియంత్రణ: రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరించడంలో మెంతులు అద్భుతంగా పనిచేస్తాయి. ఇవి జీవక్రియనువేగవంతం చేస్తాయి. ఆకలిని తగ్గిస్తాయి మరియు శరీరంలోని అదనపు కొవ్వును కరిగించి బరువు తగ్గడానికి సహకరిస్తాయి.

మహిళల ఆరోగ్యానికి వరం: మహిళల్లో హార్మోన్ల సమతుల్యతకు మెంతులు ఒక దివ్యౌషధం. హార్మోన్లను నియంత్రించడం ద్వారా PCOD, థైరాయిడ్, క్రమరహిత రుతుక్రమం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి. ఈస్ట్రోజెన్ స్థాయిలను సమతుల్యం చేయడం ద్వారా చర్మం యవ్వనంగా ఉండటానికి, జుట్టు దృఢంగా పెరగడానికి ఇవి తోడ్పడతాయి.

చిన్న గింజలే కదా అని తక్కువ అంచనా వేయకుండా, రోజువారీ జీవనశైలిలో మెంతులను భాగం చేసుకుంటే దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ప్రకృతి ప్రసాదించిన ఈ ఔషధ గనితో ఆరోగ్యకరమైన జీవితం మీ సొంతం.