Bike Metal Tag: కారు, బైక్‌ కొన్నప్పుడు కీతోపాటు ఈ మెటల్‌ ట్యాగ్ ఎందుకు ఇస్తారో తెలుసా?

Updated on: Mar 26, 2026 | 12:18 PM

కొత్త కారు లేదా బైక్ వంటి ఏదైనా కొత్త వాహనం కొన్న తర్వాత షోరూమ్ సిబ్బంది మీకు తాళం చెవి ఇస్తారు. అయితే దీనికి ఒక లోహపు లేదా అల్యూమినియం ట్యాగ్ ఉంటుంది. కానీ అది పనికిరానిదని భావించి, చాలా మంది పారేస్తుంటారు. కొందరు ఆ ట్యాగ్‌ను యేళ్ల పాటు కీ రిమోట్‌కు వేలాడదీసి కూడా ఉంచుతారు..

1 / 5
కొత్త కారు లేదా బైక్ వంటి ఏదైనా కొత్త వాహనం కొన్న తర్వాత షోరూమ్ సిబ్బంది మీకు తాళం చెవి ఇస్తారు. అయితే దీనికి ఒక లోహపు లేదా అల్యూమినియం ట్యాగ్ ఉంటుంది. కానీ అది పనికిరానిదని భావించి, చాలా మంది పారేస్తుంటారు. కొందరు ఆ ట్యాగ్‌ను యేళ్ల పాటు కీ రిమోట్‌కు వేలాడదీసి కూడా ఉంచుతారు. అయితే పైకి అంత ముఖ్యమైనదిగా అనిపించని ఈ మెటల్‌ ట్యాగ్‌ణు కీతో పాటు ఎందుకు ఇస్తారు? దీని వెనుక కారణం ఏమిటో మీకు తెలుసా?

2 / 5
కారు లేదా బైక్ కీతో పాటు వచ్చే ఈ చిన్న లోహపు ముక్కపై ఒక సంఖ్యా లేదా కోడ్ ఉంటుంది. దీనిని 'కీ కోడ్' అంటారు. ఈ కోడ్ మీ వాహన కీ సాంకేతిక గుర్తింపు సంఖ్య. ఒకవేళ మీరు వాహనం తాళంచెవిని ఎప్పుడైనా పోగొట్టుకుంటే కొత్త తాళంచెవిని తయారు చేయడానికి ఈ కోడ్ చాలా అవసరం. గతంలో తాళంచెవి పోగొట్టుకుంటే తాళం పగలగొట్టడమో లేదా మొత్తం తాళపు వ్యవస్థను మార్చడమో జరిగేది. అయితే, ఆధునిక యంత్రాల సహాయంతో కంపెనీలు ఇప్పుడు ఈ కోడ్ ఆధారంగా అసలు తాళంచెవి లాగే ఉండే కొత్త తాళంచెవిని తయారు చేస్తున్నారు.

3 / 5
కొత్త కీని తయారు చేయడంలో ఈ కోడ్ సహాయపడుతుంది. ఈ కోడ్‌ను అధీకృత సర్వీస్ సెంటర్‌లో ఇస్తే వారు దానిని ఒక ప్రత్యేక యంత్రంలో నమోదు చేస్తారు. ఆ యంత్రం ఈ కోడ్ ఆధారంగా ఒక నిర్దిష్ట కీ కటింగ్ నమూనాని ఇస్తుంది. అందువల్ల, ఈ ప్రక్రియ ద్వారా తయారు చేసిన కొత్త కీ అసలు కీ లాగే పనిచేస్తుంది. లాక్‌లోకి సులభంగా సరిపోతుంది. అయితే ఈ కోడ్ అందుబాటులో లేకపోతే కొత్త కీ తయారు చేయడానికి మెకానిక్‌కు చాలా సమయం పడుతుంది. కొన్నిసార్లు మొత్తం లాక్ కిట్‌ను మార్చాల్సి వస్తుంది.

4 / 5
స్మార్ట్ కీలు, కీ ఫాబ్‌ల యుగంలో కూడా ఈ ట్యాగ్ ఎందుకు వినియోగిస్తారనే సందేహం చాలా మందికి ఉంటుంది. నిజానికి ఆధునిక కార్లు స్మార్ట్ కీ లేదా కీ ఫాబ్ సిస్టమ్‌తో వస్తున్నాయి. ఈ సిస్టమ్‌లో ఎలక్ట్రానిక్ లాకింగ్‌తో పాటు ఒక చిన్న అత్యవసర కీ కూడా ఉంటుంది. ఒకవేళ ఈ కీ పోయినా లేదా పాడైపోయినా అత్యవసర పరిస్థితుల్లో కొత్త కీని తయారు చేయడానికి కీ కోడ్ అవసరం అవుతుంది. అంతేకాకుండా ఈ కోడ్‌ను ఉపయోగించి సర్వీస్ సెంటర్ వారు సిస్టమ్ నుంచి పాత కీ సిగ్నల్‌ను తొలగించి, కొత్త కీని రిజిస్టర్ చేసే అవకాశం ఉంది.

5 / 5
ఈ చిన్న లోహపు ట్యాగ్‌ను మీ కారు కీ డిజిటల్ గుర్తింపు సంఖ్యగా పరిగణిస్తారు. అందువల్ల దీనిని సురక్షితంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అందుకే ఈ ట్యాగ్‌ను కీతో పాటు వేలాడదీయవద్దని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఈ ట్యాగ్‌ను మీ కారు పత్రాలతో పాటు సురక్షితమైన ప్రదేశంలో దాచడం మంచిది. లేదంటే ఈ కోడ్‌ను ఫోటో తీసి మీ మొబైల్ లేదా ఈమెయిల్‌లో సేవ్ చేసుకోవడం మంచిది. ఒకవేళ ఈ కోడ్ దొంగలకు చిక్కితే, ఆ వ్యక్తి దానిని ఉపయోగించి డూప్లికేట్ కీని తయారు చేయించే అవకాశం ఉంది. అందువల్ల ఈ చిన్న ట్యాగ్‌ను దాచుకోవడమే మంచిది.

Follow Us