Ice Apple: వేసవిలో దొరికే ఈ పండ్లను తినడం ఎన్ని ప్రయోజనాలో.. తెలిస్తే అస్సలు వదలరు!

Updated on: Mar 18, 2026 | 4:03 PM

వేసవిలో లభించే అత్యంత ఆరోగ్యకరమైన తాటి ముంజలు తినేందుకు చాలా మంది ఇష్టపడుతారు. ఎండాకాలం వచ్చిందటే చాలూ రోడ్లపైనా, మార్కెట్లలోనూ వీటికి గిరాకీ పెరిగిపోతుంది. ఈ తాటి రుచితోపాటు ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. అలాగే వీటిలో అధికంగా ఉండే నీటి శాతం డీహైడ్రేషన్‌ను నివారించడంలో సహాయపడుతుంది. ఇవే కాకుండా వేసవిలో ఈ పండు తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
వేసవిలో లభించే అత్యంత ముఖ్యమైన పండ్లలో తాటి ముంజలు కూడా ఒకటి. ఇవి జెల్లీ లాంటి ఆకృతిని కలిగి ఉండి, చేతిలో పట్టుకున్నప్పుడు జారిపోయేంత మెత్తగా ఉంటాయి. ఇవి రుచికి తియ్యగా ఉండి, నోటిలో వేసుకోగానే కరిగిపోతాయి. వేసవిలో శరీరానికి హైడ్రెట్‌గా ఉంచే ఈ పండును 'ఐస్ ఆపిల్' అని కూడా పిలుస్తారు. వేసవిలో విరివిగా లభించే ఈ పళ్లు శరీరాన్ని చల్లబరచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా అనేక విధాలుగా మేలు చేస్తాయి.

2 / 5
ఈ పండులో తక్కువ కేలరీలు, శరీరానికి అవసరమైన అధిక శక్తి ఉంటాయి. అందువల్ల, వేసవిలో చల్లబడటానికి తాటి ముంజలను తినడం చాలా ముఖ్యం. వేసవిలో ఎండ కారణంగా, కొంతమందికి ముఖంపై చిన్న మొటిమలు వస్తాయి. వీటి నుండి ఉపశమనం పొందడానికి, మీరు తాటి ముంజలను తినాలి. వేసవిలో ఎంత నీరు తాగినా నిర్జలీకరణానికి గురికావడం సర్వసాధారణం. అలాంటప్పుడు ఈ పండ్లు తినడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.

3 / 5
తాటి ముంజల్లో ఎక్కువ నీటితో పాటు మన శరీరానికి అవసరమైన ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి చక్కెరలను సమతుల్యం చేయడంలో సహాయపడుతాయి. ఈ పండ్లలో శరీరానికి చాలా అవసరమైన విటమిన్ బి, ఇనుము, కాల్షియం అధిక మొత్తంలో ఉంటాయి. ఈ పండ్లు ఆకారంలో లిచీ పండును పోలి ఉంటాయి.

4 / 5
 గర్భధారణ సమయంలో కొందరు మహిళలు జీర్ణ సమస్యను ఎదుర్కొంటారు. అలాంటి వారికి ఈ తాటి ముంజలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఎందుకంటే ఇది జీర్ణవ్యవస్థ చురుకుగా మార్చడంతో పాటు మలబద్ధకం, ఎసిడిటీ వంటి ఆరోగ్య సమస్యల నుండి కూడా ఇది ఉపశమనం కలిగిస్తుంది.

5 / 5
వేసవిలో అధిక ఎండ కారణంగా జనాలు త్వరగా అలసిపోతారు. అలాగే ఎండవల్ల చెమట కూడా విపరీతంగా వస్తుంది. దీని వల్ల శరీరంలోని నీటి శాతం తగ్గిపోతుంది. ఈ క్రమంలో, శరీరం కోల్పోయిన నీటిని తిరిగి అందించడానికి, అలసట నుండి ఉపశమనం పొందడానికి తాటి ముంజలు ఎంతగానో ఉపయోగపడుతాయి. ( Note: పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్, నివేదికల నుంచి సేకరించిన సమాచారం ఆదారంగా అందించబడినవది. వీటిని TV9 దృవీకరించడం లేదు. వీటిపై మీకేవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

Follow Us