
ఉల్లిపాయ.. కిచెన్‌లో ఉండే ముఖ్యమైన కూరగాయాల్లో ఇది కూడా ఒకటి. అయితే దీన్ని కట్‌చేసే సమయంలో మన కళ్ల నుంచి నీరు వస్తుంటాయి. అయితే దీని వెనుక ఒక ఆసక్తికరమైన శాస్త్రీయ కారణం ఉందట. అవును ఉల్లిపాయ పొరల్లోని కణాలలో సల్ఫర్ సమ్మేళనాలు , ఎంజైమ్‌లు ఉంటాయట. నార్మల్‌గా అయితే ఇవి వేర్వేరుగా ఉంటాయిట.

కానీ మనం కత్తిలో ఉల్లిపాయను కోసినప్పుడు ఆ కణాలు విచ్చిన్నమై, కదానితో ఒకటి కలిసిపోతాయట. ఈ రసాయన చర్య కారణంగా లాక్రిమేటరీ ఫ్యాక్టర్ అనే ఘాటైన వాయువు విడుదలవుతుందట. ఈ వాయువు మన కళ్ల వరకు చేరడంతో మన కళ్లలో మంటను పుట్టిస్తుందట. అందుకే మన కళ్ల నుంచి నీరు వాస్తాయట.

అయితే మన కళ్లు చాలా సున్నితంగా ఉంటాయి. ఏవైనా హానికర రసాయనాలు లేదా వాయువుల మన కంటి పొరల అంచుకు చేరినప్పుడూ అవి వెంటనే స్పందిస్తాయి. అలాగే ఉల్లిపాయ నుంచి వెలువడే వాయువు కళ్లకు దరిచేరగానే.. కళ్లు దాన్ని ఒక ప్రమాదకర పదార్థంగా గ్రహించి.. కంటిని రక్షించేందుకు ఉండే లాక్రిమల్ గ్రంథులు వాటర్‌ను స్రవింపజేస్తాయట. అలా వచ్చిన కన్నీళ్లు ఆ ఘాటైన వాయువును బయటకు పంపి కంటిని కాపాడుతాయట.

అయితే కొందరు సైంటిస్ట్‌ల ప్రకారం.. ఇది ఉల్లిపాయకు సహజ రక్షణ వ్యవస్థగా పనిచేస్తుందట. క్రిమికీటకాలు, జంతువులు తనను నాశనం చేయకుండా కాపాడుకోవడానికి ప్రకృతి ఉల్లిపాయకు ఈ రసాయనాన్ని ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని ఇచ్చిందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ ఘాటైన వాయువు కేవలం కళ్ల నుంచి నీరు తేవడమే కాకుండా.. జంతువులను, కీటకాలను నుంచి ఉల్లిపాయను రక్షిస్తోందట.

అయితే కట్‌చేసేప్పుడు కొన్ని చిట్కాలు పాటిస్తే.. ఈ కన్నీళ్లు రాకుండా అడ్డుకోవచ్చు. ఇందుకోసం ఉల్లిపాయను కోయడానికి 10-15 నిమిషాల ముందు వాటిని ఫ్రిజ్‌లో ఉంచండి. ఆ తర్వాత వాటిని తీసి కట్‌చేయండి. చల్లగా ఉన్నప్పుడు ఉల్లిపాయ నుంచి వాయువు తక్కువ మొత్తం నుంచి వెలువడే వాయువు పరిమాణం తగ్గుతుంది. మరో మార్గం ఏంటంటే ఉల్లిపాయను నీటిలో నానబెట్టి కోస్తే వాటి నుంచి రిలీజ్ అయ్యే వాయువు నీటిలో కరిగిపోయి కళ్లపై ప్రభావం తగ్గుతుంది.