
కిడ్నీ బాధితులు: కిడ్నీ సమస్యలు ఉన్నవారు పుచ్చకాయకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇందులో పొటాషియం మోతాదు చాలా ఎక్కువగా ఉంటుంది. కిడ్నీలు సరిగ్గా పనిచేయనప్పుడు ఈ పొటాషియంను ఫిల్టర్ చేయడం కష్టమవుతుంది. శరీరంలో పొటాషియం పెరిగితే కండరాల బలహీనత, విపరీతమైన అలసట వస్తాయి. ఇది గుండె లయను తప్పించి, శరీరంలో వాపులకు దారితీస్తుంది. ముఖ్యంగా డయాలసిస్ చేయించుకునే వారు దీనికి దూరంగా ఉండాలి.

మధుమేహం: పుచ్చకాయ తీయగా ఉండటమే కాదు..దీని గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా ఎక్కువ. ఇది తిన్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరుగుతాయి. ఆ తర్వాత అంతే వేగంగా పడిపోతాయి. దీనివల్ల డయాబెటిస్ ఉన్నవారికి తల తిరగడం, నీరసం వంటి సమస్యలు తలెత్తుతాయి. వైద్యుల సలహా లేకుండా వీటిని తీసుకోకపోవడమే ఉత్తమం.

కాలేయ వ్యాధులు: లివర్ సమస్యలు ఉన్నవారికి పుచ్చకాయలోని ఫ్రక్టోజ్ జీర్ణం కావడం కష్టమవుతుంది. ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారు పుచ్చకాయ తింటే కాలేయం చుట్టూ మంట పెరిగే అవకాశం ఉంది. ఆల్కహాల్ తీసుకోని వారికి వచ్చే ఫ్యాటీ లివర్ బాధితులు కూడా జాగ్రత్తగా ఉండాలి.

జీర్ణక్రియ సమస్యలు: అసిడిటీ, గ్యాస్ లేదా IBS ఉన్నవారికి పుచ్చకాయ ఇబ్బందులను కలిగిస్తుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉన్నప్పటికీ, సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారిలో ఇది కడుపు నొప్పి, ఉబ్బరం, అజీర్ణానికి కారణమవుతుంది.

ఆస్తమా - అలెర్జీలు: ఆస్తమా ఉన్న రోగులలో పుచ్చకాయలోని కొన్ని ఎంజైమ్‌లు ఓరల్ అలెర్జీ సిండ్రోమ్‌ను ప్రేరేపిస్తాయి. గొంతులో గర గర, శ్వాసనాళాల్లో వాపు రావచ్చు. అలెర్జీలు ఉన్నవారు ఈ పండును తినే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి.