కార్తీక మాసంలో పౌర్ణమి రోజున చేసుకోవాల్సిన రెసిపీ ఇదే.. కప్పు గోధుమ రవ్వ, బెల్లంతో

Updated on: Nov 12, 2026 | 2:46 PM

గోధుమ రవ్వ హల్వా అనేది తెలుగు వంటకాల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్న తీపి వంటకం. పండుగలు, శుభకార్యాలు, ముఖ్యంగా సత్యనారాయణ స్వామి వ్రతం ప్రసాదంగా తయారుచేస్తారు. కార్తీక మాసంలో, ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున ఈ ప్రసాదాన్ని తయారుచేయడం ఆచారం. ఈ వంటకాన్ని ఇంట్లో సులభంగా, చాలా రుచికరంగా ఎలా తయారుచేయాలో ఇక్కడ చూద్దాం..

1 / 5
కావాల్సిన పదార్థాలు: ఎర్ర గోధుమ రవ్వ: 1 కప్పు, నీళ్లు: 4 కప్పులు, తురిమిన బెల్లం: అర కప్పు , 4 టేబుల్ స్పూన్స్ నెయ్యి, 
 జీడిపప్పు: కొన్ని,  కిస్మిస్: కొన్ని, యాలకుల పొడి: 4 యాలకులకు సరిపడా తీసుకోవాలి. ముందుగా ఒక మందపాటి పాన్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి కరిగిన తర్వాత కొన్ని జీడిపప్పులు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. జీడిపప్పులు కొద్దిగా వేగిన తర్వాత కొన్ని కిస్మిస్‌లు కూడా వేసి వేయించి, ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి.

కావాల్సిన పదార్థాలు: ఎర్ర గోధుమ రవ్వ: 1 కప్పు, నీళ్లు: 4 కప్పులు, తురిమిన బెల్లం: అర కప్పు , 4 టేబుల్ స్పూన్స్ నెయ్యి, జీడిపప్పు: కొన్ని, కిస్మిస్: కొన్ని, యాలకుల పొడి: 4 యాలకులకు సరిపడా తీసుకోవాలి. ముందుగా ఒక మందపాటి పాన్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి కరిగిన తర్వాత కొన్ని జీడిపప్పులు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. జీడిపప్పులు కొద్దిగా వేగిన తర్వాత కొన్ని కిస్మిస్‌లు కూడా వేసి వేయించి, ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి.

2 / 5
జీడిపప్పు వేయించిన అదే నెయ్యిలో ఒక కప్పు ఎర్ర గోధుమ రవ్వను వేసుకోవాలి. సాధారణంగా ఉప్మాకు ఉపయోగించే తెల్ల రవ్వ కాకుండా, ఎర్ర రంగులో ఉండే గోధుమ రవ్వను దీనికి వాడతారు. మంటను పూర్తిగా తగ్గించి, రవ్వను మాడిపోకుండా నిరంతరం కలుపుతూ సుమారు 10 నిమిషాల పాటు వేయించాలి. రవ్వ చక్కగా వేగిన తర్వాత కమ్మటి సువాసన వస్తుంది, అలాగే రవ్వ రంగు కొద్దిగా తెల్లగా మారుతుంది. రవ్వ వేగే సమయంలో, మరొక గిన్నెలో నాలుగు కప్పుల నీటిని తీసుకుని మరిగించాలి. ఒక కప్పు రవ్వకు నాలుగు కప్పుల నీళ్లు సరైన కొలత. ఉప్మాకు మూడు కప్పులు సరిపోతాయి కానీ హల్వాకు నాలుగు కప్పులు అవసరం.

3 / 5

రవ్వ బాగా వేగిన తర్వాత, మరుగుతున్న నీటిని కొద్దికొద్దిగా వేయించుకున్న రవ్వలో పోయాలి. నీటిని ఒకేసారి కాకుండా కొద్దికొద్దిగా పోయడం వల్ల పొంగిపోకుండా ఉంటుంది. కావాలంటే స్టవ్ ఆపి నీళ్లు కలిపిన తర్వాత మళ్లీ స్టవ్ ఆన్ చేసుకోవచ్చు. నీటిని పూర్తిగా కలిపిన తర్వాత, మూత పెట్టి, సన్నని మంటపై రవ్వ మెత్తబడేంత వరకు ఉడికించాలి. మాడిపోకుండా మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. నీరు పూర్తిగా ఇంకిపోయేంత వరకు ఉడికించాలి. రవ్వ చేత్తో నొక్కి చూస్తే చాలా మెత్తగా ఉండాలి. ఒకవేళ రవ్వ సరిగా ఉడకకపోతే, మరికొన్ని వేడి నీళ్లు కలిపి ఉడికించుకోవచ్చు.

4 / 5

 రవ్వ చక్కగా ఉడికిన తర్వాత, అందులో ఒకటి ముప్పావు కప్పు తురిమిన బెల్లాన్ని వేయాలి. తీపి ఎక్కువగా తిననివారు బెల్లాన్ని తగ్గించుకోవచ్చు. బెల్లంలో నలకలు ఉంటే, కొద్దిగా నీటిలో కరిగించి వడగట్టి వేసుకోవచ్చు. నలకలు లేని బెల్లం అయితే నేరుగా వేసేయవచ్చు. సన్నని మంటపై బెల్లం పూర్తిగా కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి.

5 / 5
బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత, నాలుగు యాలకులను మెత్తగా పొడిచేసి వేయాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసి అంతా బాగా కలుపుకోవాలి. మిశ్రమం కొద్దిగా పల్చగా అనిపించినా, సన్నని మంటపై మూత పెట్టి మధ్యమధ్యలో కలుపుతూ చిక్కబడేంత వరకు ఉడికించాలి. హల్వా దగ్గరపడి, గట్టిపడకుండా జిగురుగా మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్‌లను కలిపి మరో టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బాగా కలపాలి. ఈ గోధుమ రవ్వ  హల్వా అచ్చం గుళ్లో ప్రసాదంలా రుచిగా ఉంటుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us