Wheat-Flour Adulteration: మీరు మార్కెట్లో కొనుగోలు చేసే పిండి స్వచ్ఛమైనదేనా? ఇలా టెస్ట్ చేసి తెలుసుకోండి

|

Sep 10, 2024 | 12:40 PM

నేటి కాలంలో ప్రతిదీ కల్తీమయం అవుతుంది. ఏది నిజమో, ఏది నకిలీదో అర్థం చేసుకోవడం అంత తేలికైన పని కాదు. మార్కెట్‌లో దొరికే పప్పు ఉప్పుల నుంచి అధిక ధరలతో కొనే నిత్యావసర వస్తువుల వరకు అన్నింటిలో కల్తీ రాయుళ్లు చేతి వాటం ప్రదర్శిస్తున్నారు. కల్తీ, అనారోగ్యకరమైన, విషపూరితమైన ఆహారాలు తినడం వల్ల మనకు తెలియకుండానే శరీరాన్ని రోగాల మయం చేస్తుంది. ముఖ్యంగా మార్కెట్లో ఏదైనా పిండి కొనుగోలు చేస్తే..

1 / 5
నేటి కాలంలో ప్రతిదీ కల్తీమయం అవుతుంది. ఏది నిజమో, ఏది నకిలీదో అర్థం చేసుకోవడం అంత తేలికైన పని కాదు. మార్కెట్‌లో దొరికే పప్పు ఉప్పుల నుంచి అధిక ధరలతో కొనే నిత్యావసర వస్తువుల వరకు అన్నింటిలో కల్తీ రాయుళ్లు చేతి వాటం ప్రదర్శిస్తున్నారు. కల్తీ, అనారోగ్యకరమైన, విషపూరితమైన ఆహారాలు తినడం వల్ల మనకు తెలియకుండానే శరీరాన్ని రోగాల మయం చేస్తుంది. ముఖ్యంగా మార్కెట్లో ఏదైనా పిండి కొనుగోలు చేస్తే.. అది మంచిదా చెడ్డదా, అది ఎంత నాణ్యమైదనదో ఇలా తెలుసుకోండి.

2 / 5
ఈ రోజుల్లో రాగి పిండి నుండి బోరిక్ యాసిడ్ వరకు వివిధ రకాల కల్తీలు కలుపుతున్నారు. ఇలాంటి కల్తీ పిండి తింటే పొట్టకు తీవ్రమైన హాని కలిగిస్తుంది. తరచూ కడుపు నొప్పిని కూడా కలిగిస్తుంది. క్రమంగా మూత్రపిండాలు కూడా దెబ్బతినడం ఖాయం. అందుకే భారత ఆహార భద్రత, ప్రమాణాల అథారిటీ (FSSAI) పిండి కల్తీ కాదా అని తెలుసుకోవడానికి సులభమైన మార్గాన్ని కనిపెట్టింది. ఎలాగో చూద్దాం..

3 / 5
మార్కెట్ నుండి కొనుగోలు చేసిన ఒక చెంచా పిండిని ఒక గ్లాసు శుభ్రమైన నీటిలో కలపాలి. ఆ పిండిని చెంచాతో కలిపిన తర్వాత పిండి నీళ్లపైన తేలితే అది కల్తీ అని అర్ధం చేసుకోవాలి. ఒకవేళ పిండిలో కల్తీ ఉంటే పిండి మొత్తం నీటిలో కరగదు.. పైకి తేలుతుంది. పిండి స్వచ్ఛమైనదైతేనే అది నీటిలో కలుస్తుంది.

4 / 5
పిండిలో కల్తీకి ప్రత్యేక పరీక్ష కూడా ఉంది. ముందుగా టెస్ట్ ట్యూబ్ తీసుకోవాలి. ఆ ట్యూబ్‌లో 1 గ్రాము పిండిని తీసుకుని, ఆ పిండిలో 5 ఎంజీల నీళ్లతో బాగా కలపాలి. ఇప్పుడు దానికి కొన్ని చుక్కల సాంద్రీకృత హైడ్రోక్లోరిక్ యాసిడ్ జోడించాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో పసుపు పేపర్ స్ట్రిప్‌ను ముంచాలి. పసుపు పేపర్ స్ట్రిప్ రంగు అస్సలు మారకపోతే పిండిలో కల్తీ లేదని అర్ధం చేసుకోవాలి.

5 / 5
పసుపు పేపర్ స్ట్రిప్ రంగు ఎర్రగా మారితే పిండిలో కల్తీ ఉందని అర్థం చేసుకోవాలి. ఆ విషయంలో జాగ్రత్తగా పరీక్షించి తీసుకోవాలి. కల్తీ ఉన్నట్లు తెలితే ఆ స్టోర్ గురించి పోలీసులకు ఫిర్యాదు చేయాలి.