
సాధారణంగా ఇప్పటి వరకు ఎవరైన ఒక కొత్త పర్సన్ వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ అయితే అతనికి గతంలో జరిగిన ఛాట్స్, వీడియోస్ ఏవి కనిపించేవి కాదు. అతను జాయిన్ అయిన తర్వాత జరిగే చాట్స్ మాత్రమే వారు చూడగలిగే వారు. కానీ వినియోగదారులను వచ్చిన రిక్వెస్ట్‌ల ఆధారంగా దీనిని అప్‌డేట్ చేస్తూ వాట్సాప్ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఈ ఫీచర్ ద్వారా ఎవరైనా ఒక కొత్త వ్యక్తి వాట్సాప్ గ్రాప్‌లో యాడ్ అయినప్పుడు అతను గతంలో జరిగిన ఛాటింగ్స్ కూడా ఈజీగా చూసేందుకు ఈ ఫీచర్ అవకాశం కల్పిస్తుంది. దీని వలన గ్రూప్ అడ్మిన్లు, సభ్యులు పాత సందేశాలను గ్రూప్‌లోని కొత్త సభ్యులకు సులభంగా ఫార్వార్డ్ చేయవచ్చు.

అయితే ఈ ఫీచర్‌ను అనౌన్స్ చేసినప్పుడూ వినియోగదారులు ఎక్కవగా తీసుకురావలని కోరిన ఫీచర్ ఇదేనని.. యూజర్స్ అభ్యర్థన మేరకు ఈ సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చిన వాట్సాప్ చెప్పుకొచ్చింది.గ్రూప్ మెసేజింగ్‌లో వారు ఎలా ముందున్నారో చెప్పడానికి ఇది మరొక ఉదాహరణ అని కూడా వాట్సాప్ వివరించింది.

గ్రూప్ మెసేజ్ హిస్టరీ అన్ని ఇతర వ్యక్తిగత మెసేజ్‌ల మాదిరిగానే ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేయబడి ఉంటుంది. 'గ్రూప్ మెసేజ్ హిస్టరీ' ఫీచర్ అదనపు స్క్రీన్‌షాట్‌లు లేదా అనవసరమైన మెసేజ్ ఫార్వార్డింగ్ అవసరాన్ని తొలగిస్తుంది. గ్రూప్ చాట్‌కి కొత్త వ్యక్తిని వచ్చినప్పుడు అడ్మిన్‌లు, సభ్యులు తమకు ముఖ్యమైన 25 నుండి 100 మెసేజ్‌లను అందుబాటులో ఉంచుకునే అవకాశం ఉంటుంది. దీని వలన కొత్త సభ్యులు గ్రూప్‌లోని ఈ మెసేజ్‌లు చూడటానికి వీలు కలుగుతుంది.

అయితే ఈ ఫీచర్ గ్రూప్‌కు అవసరమా లేదా అనేది అడ్మిన్ నిర్ణయించుకోవచ్చు. అడ్మిన్ ఎల్లప్పుడూ మెసేజ్ హిస్టరీని కూడా షేర్ చేయవచ్చు. గ్రాప్ నుంచి ఏదైనా మెసేజ్ హిస్టరీ షేర్ చేస్తే, గ్రూప్‌లోని ఇతర సభ్యులకు కూడా దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వెళ్తోంది. దీని వలన గ్రాప్‌లో ఉన్న వ్యక్తులు ఏ మెసేజ్‌లు షేర్ చేస్తున్నారో తెలుసుకోవచ్చు. ఈ ఫీచర్ దశలవారీగా వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.