
చాలా మంది ఇళ్ళలో పాలు వేడి చేసిన తర్వాత విరిగిపోతుంటాయి. అయితే, దీనితో ఆడవాళ్లకి పెద్ద కష్టం వచ్చినంత పని అవుతుంది. అయితే, మీరేం చింతించకండి. ఈ సహజ చిట్కాలను పాటిస్తే రెండు రోజుల వరకు ఫ్రెష్ గా ఉంటాయి.

ఆడ వాళ్ళలో కొందరు పాలు తెచ్చిన వెంటనే 10 నిముషాలు పాటు పొయ్యి మీద పెట్టి దించేస్తుంటారు. దీని వలన అవి త్వరగా ఆరిపోయి విరిపోతాయి అలా కాకుండా పాలను స్టవ్ మీదే 25 నిముషాల పాటు మరిగించండి. ఇలా చేస్తే రెండు రోజుల వరకు ఫ్రెష్ గా ఉంటాయి.

పాలు వేడే చేసేటప్పుడు దానిలో వంటసోడా కొద్దిగా వేస్తె పాలు అస్సలు విరగవు.ఇది లేకపోతే మీ ఇంట్లో సాల్ట్ ఉన్నా కూడా అది అయినా కొద్దిగా వేయండి పాలు విరగకుండా ఉంటాయి.

పాలు వేడి అయ్యే ముందు దానిలో ఒకటి లేదా మూడు యాలకులు వేస్తే విరాకుండా ఉంటాయి. ఈ చిట్కా బాగా పని చేస్తుంది.

పాలను బయట కాకుండా ఫ్రిజ్ లో స్టోర్ చేస్తే పాలు పాడవ్వకుండా ఉండటమే కాకుండా విరిగిపోకుండా ఉంటాయి. ఇలా చేస్తే రెండు రోజుల వరకు ఏం కాదు.