ATM Cash Withdrawal: విత్‌డ్రా చేసేటప్పుడు ఏటీఎమ్‌లో క్యాష్‌ ఇరుక్కుపోతే.. వెంటనే ఇలా చేయండి!

Updated on: Sep 15, 2025 | 2:08 PM

ATM నుంచి డబ్బు విత్‌డ్రా చేసేటప్పుడు సాంకేతిక కారణాల వల్ల అది మిషన్‌లోనే చిక్కుకుపోవడం మనలో చాలా మందికి అనుభవమే. అలాంటి సందర్భంలో ఏం చేయాలో తెలియక మనం టెన్షన్‌ పడుతుంటాం. ఇలాంటి అనుభం మీకెప్పుడైనా ఎదురైతే భయపడవద్దు. ఇరుక్కుపోయిన నోటును బయటకు తీయడానికి ప్రయత్నించవద్దు. ఎందుకంటే..

1 / 5
కొన్నిసార్లు ATM నుంచి డబ్బు విత్‌డ్రా చేసేటప్పుడు సాంకేతిక కారణాల వల్ల అది మిషన్‌లోనే చిక్కుకుపోవడం మనలో చాలా మందికి అనుభవమే. అలాంటి సందర్భంలో ఏం చేయాలో తెలియక మనం టెన్షన్‌ పడుతుంటాం. ఇలాంటి అనుభం మీకెప్పుడైనా ఎదురైతే భయపడవద్దు. ఇరుక్కుపోయిన నోటును బయటకు తీయడానికి ప్రయత్నించవద్దు. ఎందుకంటే అవి చిరిగిపోయే ప్రమాదం ఉంది. సర్వర్‌ పనిచేయకపోవడం వల్ల ఈ సమస్య సంభవిస్తుంది.

2 / 5
కొంత సమయం వేచి ఉన్న తర్వాత కూడా డబ్బు ATM మెషీన్ నుంచి బయటకు రాకపోతే, మీ ఖాతా నుంచి డబ్బు బదిలీ అయినట్లుగా వచ్చిన లావాదేవీకి సంబంధించిన రసీదును మీ వద్దపూ ఉంచుకోవాలి. ఒకవేళ అది మీ వద్ద లేకుంటే మీ మొబైల్‌కు వచ్చిన మెసేజ్‌ లేదంటే బ్యాంక్ స్టేట్‌మెంట్ ద్వారా ఫిర్యాదు చేసేందుకు ఉపయోగపడుతుంది.

3 / 5
ఇలా జరిగిన సందర్భంలో సాధారణంగా బ్యాంకు యాజమన్యం మీ ఖాతాకు నగదును 24 గంటల్లోపు స్వయంచాలకంగా తిరిగి క్రెడిట్ చేస్తుంది. కాబట్టి వెంటనే భయపడి ప్యానిక్‌ అవకండి. ఆ మొత్తం మీ ఖాతాకు తిరిగి వస్తుంది.

4 / 5
24 గంటల తర్వాత కూడా డబ్బు ఖాతాకు బదిలీ కాకపోతే కస్టమర్ సర్వీస్ సెంటర్‌ను సంప్రదించాలి. ఏటీఎం మెషిన్ ఏ ప్రాంతంలో ఉందో, అది ఏ బ్యాంకుకు చెందినదో వారికి తెలియజేయాలి. సాధారణంగా బ్యాంకులు ఏడు రోజుల్లోపు ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తాయి. కస్టమర్ కేర్ నుండి మీకు సంతృప్తికరమైన స్పందన రాకపోతే సమీపంలోని బ్యాంకు శాఖకు వెళ్లండి. అక్కడ ఫిర్యాదు చేసి.. వారి నుంచి ట్రాకింగ్ నంబర్ తీసుకోవాలి. దీని ఆధారంగా మీ ఫిర్యాదు స్టేటస్‌ తెలుస్తుంది.

5 / 5
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిబంధనల ప్రకారం బ్యాంకులు తమ లావాదేవీల వివరాలను ధృవీకరించి, 45 రోజుల్లోపు ఆ మొత్తాన్ని వినియోగదారులకు తిరిగి చెల్లించాలి. లేకుంటే సదరు కస్టమర్‌కు దానిపై అసలు మొత్తంతోపాటు వడ్డీని కూడా చెల్లించాల్సి ఉంటుంది.