
మన జీవితంలో ఏదో ఒక సందర్భంలో మనం పామును చూసే ఉంటాం. ఎందుకంటే ఇవి మన చుట్టూ ఉండే పరిసరాల్లోనే నివసిస్తూ ఉంటాయి. అలాగే ఇవి చాలా విషపూరితమైనవి.. వీటి విషం కారణంగా ఇవి కారిస్తే కొన్ని సార్లు ప్రాణం పోయే ప్రమాదం కూడా ఉంటుంది. అయితే మనషి ప్రాణాలు సైతం తీసే ఆ పాము విషయం ఏ రంగులో ఉంటుందనే విషయానికి వస్తే శాస్త్రవేత్తలు, నిపుణుల ప్రకారం.. పాము విషం పసుపు రంగులో ఉంటుందట.

అయితే ఈ విషం అన్ని పాములలో ఒకేలా ఉండకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. పాము జాతిని, అది నివసించే ప్రదేశాన్ని బట్టి పాముల విషం రంగు మారుతూ ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే అతి ప్రమాదకరమైన, అత్యంత విషపూరితమైన పాముల విషం మాత్రం ముదురు పసుపు లేదా లేత బంగారు రంగులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

అలాగే ఈ భూమిపై ఉండే కొన్ని పాముల విషం మాత్రం లేత ఆకుపచ్చ రంగులో ఉంటుందట. అలాగే మరికొన్ని పాములలో విషం లేత తెలుపు రంగులో ఉంటుందట. అలాగే ఈ పాము విషం జిగురు వంటి ద్రవ రూపంలో ఉంటుందట. ఇది పాము తీసుకునే ఆహారం, దాని శరీరంలోని ప్రోటీన్లు, ఎంజైమ్‌ల ద్వారా తయారవుతుందట.

పాము శరీరంలో ఉండే ఈ విషం అది తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి, శత్రువుల నుంచి తనను తాను రక్షించుకోవడానికి ఉపయోగిస్తుందట. అయితే ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే.. ఈ పాము విషాన్నే దానికి విరుగుడు తయారీలో కూడా వాడుతారు. ఎప్పుడైనా పాము కరిచిన వెంటనే ఇచ్చే యాంటీడోస్ ఇంజక్షన్‌ను గుర్రం లేదా ఇతర జంతువులోకి కొద్ది విషాన్ని ఎక్కించి, వాటి రక్తంలో ఏర్పడే యాంటీబాడీలను ద్వారా ఈ యాంటీడోస్‌ను తయారు చేస్తారు.

అంతే కాదు మనుషులు వాడే గుండె జబ్బులు, రక్తపోటు, క్యాన్సర్ వంటి వ్యాధులను తగ్గించేందుకు వాడే మందుల్లోనూ ఈ పాము విషాన్ని తక్కువ మోతాదులో వాడుతారని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి పాము విషం అనేది మనుషుల ప్రాణాలు తీసేందుకు కాకుండా ప్రాణాలు రక్షించడంలో కూడా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.( Note: పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్, నివేదికల ఆధారంగా మాత్రమే అందించబడినవి.. వీటిని Tv9 దృవీకరించడం లేదు)