వంద పౌండ్ల భారీ కాయ: పనస పండు కేవలం పరిమాణంలోనే కాదు.. బరువులోనూ రికార్డులను సృష్టిస్తుంది. ఒక సాధారణ పనస పండు 3 అడుగుల పొడవు వరకు పెరిగి, దాదాపు 45 కిలోల కంటే ఎక్కువ బరువు ఉంటుంది. ఇది ఎంత బరువుగా ఉంటుందంటే.. దీన్ని మోయడానికి వెయిట్ లిఫ్టర్లు కావాలేమో అనిపించక మానదు.

ప్రపంచ రికార్డు ఇదే: గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం.. ప్రపంచంలోనే అతిపెద్ద పనస పండు 2024లో అమెరికాలోని ఫ్లోరిడాలో నమోదైంది. హ్యూ ఫోర్త్‌మాన్ అనే వ్యక్తి పండించిన ఈ పండు ఏకంగా 54.43 కిలోల బరువు తూగి అందరినీ ఆశ్చర్యపరిచింది.

మీకు తెలుసా?: అనేకమంది గుమ్మడికాయను పెద్ద పండుగా భావిస్తుంటారు. కానీ వృక్షశాస్త్రం ప్రకారం గుమ్మడికాయలు తీగల మీద, నేలపై పెరుగుతాయి. చెట్టుకు కాసే పండ్లలో మాత్రం పనస పండే అన్ డిస్ప్యూటెడ్ కింగ్. 60 నుండి 70 ఏళ్ల పాటు జీవించే ఈ చెట్లు, ఎటువంటి తెగుళ్లనైనా తట్టుకుని వివిధ రకాల నేలల్లో పెరగడం వీటి ప్రత్యేకత.

పోషకాల గని: పనసను కేవలం పండుగానే కాకుండా ఆకలిని తీర్చే అద్భుత ఆహార వనరుగా పరిగణిస్తారు. ఇది వందలాది పువ్వుల అండాశయాల కలయికతో ఏర్పడే అద్భుత నిర్మాణం. ఒకే పండులో దాదాపు 500 గింజలు ఉంటాయి. వీటిని ఉడకబెట్టి లేదా వేయించుకుని తింటే ఎంతో రుచిగా, పోషకదాయకముగా ఉంటాయి. విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉండే ఈ పండు ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఆహార భద్రతలో కీలక పాత్ర పోషిస్తోంది.