
మెరుగుపడే కాలేయ ఎంజైమ్‌లు: కాలేయం వాపుకు గురైనప్పుడు లేదా కణాలు దెబ్బతిన్నప్పుడు కాలేయ ఎంజైమ్‌లు రక్తంలోకి విడుదలవుతాయి. మద్యం మానేసిన కొద్ది రోజుల్లోనే ఈ ఎంజైమ్‌ల స్థాయిలు సాధారణ స్థితికి రావడం మొదలవుతుంది. అయితే కాలేయం ఇప్పటికే సిరోసిస్ వంటి తీవ్రమైన దశకు చేరుకుంటే మాత్రం కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది.

ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్: అధికంగా మద్యం తాగేవారి కాలేయ కణాలలో కొవ్వు పేరుకుపోతుంది. దీనినే ఫ్యాటీ లివర్ అంటారు. అయితే మద్యం మానేసిన నెల రోజుల్లోనే కాలేయం తన ప్రాధాన్యతలను మార్చుకుంటుంది. ఆల్కహాల్‌ను శుద్ధి చేసే పని తగ్గడంతో కొవ్వును కరిగించే ప్రక్రియ మళ్ళీ పుంజుకుంటుంది. దీనివల్ల కాలేయంలో పేరుకుపోయిన కొవ్వు క్రమంగా తగ్గుతుంది.

కాలేయం కేవలం రక్తాన్ని శుద్ధి చేయడమే కాకుండా శరీరంలోని చక్కెర మరియు కొవ్వు స్థాయిలను కూడా నియంత్రిస్తుంది. మద్యం మానేయడం వల్ల ఇన్సులిన్ సున్నితత్వం పెరుగుతుందని, తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు, ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతాయని BMJ ఓపెన్ జర్నల్ అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.

మన దేశంలో 50 శాతం కంటే ఎక్కువ ఆల్కహాల్ ఉన్న మద్యం ఊహించడం కష్టం. ఎందుకంటే 50 శాతం కంటే ఎక్కువ ఆల్కహాల్ ఉన్న మద్యం త్వరగా మత్తును కలిగిస్తుంది. కానీ ప్రపంచంలో ఇలాంటి కొన్ని మద్యం బ్రాండ్లు ఉన్నాయి. వాటిలో చాలా ఎక్కువ ఆల్కహాల్ కంటెంట్ ఉంటుంది.

ఈ కలయిక వలన మత్తు త్వరగా పెరిగి, వ్యక్తి నియంత్రణ కోల్పోయి సాధారణం కంటే ఎక్కువగా మద్యం తాగుతాడు. ఫలితంగా హృదయ స్పందన రేటు, రక్తపోటు పెరుగుతాయి. ముఖ్యంగా ఎనర్జీ డ్రింక్స్‌లోని కెఫీన్ గుండెపై అదనపు భారాన్ని మోపుతుంది. ఇది గుండెపోటు, పక్షవాతం వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. అకస్మాత్తుగా స్పృహ కోల్పోవచ్చు.